IPL 2023 KKR vs PBKS: తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. దీంతో కోల్ కతా కు 180 పరుగలు భారీ లక్ష్యాన్ని ఇచ్చారు. పంజాబ్ బ్యాటర్లో శిఖర్ ధావన్ 57 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో షారుఖ్ ఖాన్ (21), హర్ ప్రీత్ బ్రార్ (17) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసుకున్నాడు. హర్షిత్ రాణా 2, సుయాష్ శర్మ, నితీశ్ రాణా తలో ఒక్క వికెట్ సాధించారు.
🚨 Toss Update 🚨@PunjabKingsIPL have elected to bat against @KKRiders at Eden Gardens.
Follow the match ▶️ https://t.co/OaRtNpAfXD#TATAIPL | #KKRvPBKS pic.twitter.com/BBRAIQXvrL
— IndianPremierLeague (@IPL) May 8, 2023
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), భానుక రాజపక్స, లియామ్ లివింగ్ స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కరాన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషీ ధావన్, రాహుల్ చహర్, అర్షదీప్ సింగ్
ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్లు: నాథన్ ఎల్లిస్, అథర్వ తైడే, మోహిత్ రాథీ, మాథ్యూ షార్ట్, సికిందర్ రజా
కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాబ్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, శార్ధూల్ థాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి
ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్లు: జేసన్ రాయ్, నారాయణ్ జగదీశన్, ఫెర్గూసన్, కుల్వంత్, అనుకుల్ రాయ్
పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్ కు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.
వైభవ్ అరోరా వేసిన 19 వ ఓవర్ లో బాగానే పరుగులు వచ్చాయి. హర్ ప్రీత్ బ్రార్ (11) రెండు ఫోర్లు, షారూఖ్ ఖానఖ్ (6) ఒక ఫోర్ కొట్టారు. 19 ఓవర్లకు 158/7
కేకేఆర్ బౌలర్లు విజృంభిస్తున్నారు. సుయాశ్ శర్మ వేసిన 17.2 ఓవర్ కు సామ్ కరన్ (4) వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. 18 ఓవర్లకు 143/7 స్కోరుగా ఉంది.
వచ్చి రాగానే దూకుడు ప్రదర్శించిన రిషి ధావన్ (19) పరుగులకు అవుట్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి వేసిన 17 వ ఓవర్లో 5 బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యడు. దీంతో 17 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది పంజాడ్ . సామ్ కరన్ (4), షారుఖ్ ఖాన్ (0) క్రీజులో ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసుకున్నాడు.
పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. నరైన్ బౌలింగ్ లో 13.3 బంతికి సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే 14 ఓవర్ల లో నితిశ్ రాణా వేసిన 4 బంతికి శిఖర్ (57) పెవిలియన్ కు చేరాడు. వైభవ్ అరోరాకు క్యాచ్ ఇచ్చి క్రీజును వదిలాడు. తర్వాత వచ్చిన రిషి ధావన్.. 4 తో మ్యాచ్ ను ప్రారంభించాడు. 15 ఓవర్లకు స్కోరు 124 /5 గా ఉంది.
పంజాబ్ బ్యాటర్ జితేశ్ శర్మ(21) అవుట్ అయ్యాడు. 12.3 ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో వికెట్ కీపర్ రెహ్మనుల్లా కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 106 పరుగుల వద్ద పంజాబ్ నాల్గో వికెట్ నష్టపోయింది. 13 ఓవర్లకు 109/4. సామ్ కరన్(2), ధావన్ (48) పరుగులతో ఉన్నారు.
పంజాబ్ కెప్టెన్ ధావన్ దూకుడు పెంచాడు. నరైన్ వేసిన 12 వ ఓవర్ లో రెండు, మూడు బంతులకు బౌండరీ బాదాడు. దీంతో 12 ఓవర్లకు 104/3 గా పంజాబ్ స్కోరు ఉంది. ధావన్(46), జితేశ్ శర్మ (21) పై ఆడుతున్నారు.
11 ఓవర్ల ముగిసే సరికి పంజాబ్ 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్ (37), జితేష్ శర్మ (20) పరుగులతో ఉన్నారు. సుయాశ్ శర్మ వేసిన 11 ఓవర్ లో 11 పరుగులు వచ్చాయి.
8 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్(31), జితేష్ శర్మ(4) పరుగులతో ఉన్నారు. వరుణ్ చక్రవర్తి కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు. 8 ఓవర్ లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
పంజాబ్ కింగ్స్ కు ఎదురుదెబ్బ తగలింది. దూకుడుగా ఆడుతున్నాడనుకున్న లివింగ్ స్టోన్ 15 పరుగుల వద్ద ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి వేసిన 5.3 ఓవర్ కు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో పంజాబ్ స్కోర్ 53/3
రాజపక్స అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టోన్ దూకుడుగా ఆడుతున్నాడు. రస్సెల్ వేసిన 5 ఓవర్ లో మూడు ఫోర్లు బాదాడు. ఇందులో ఒక ఫ్రీ హిట్ అదనం. శిఖర్ ధావన్ (20), లివింగ్ స్టోన్ (14) పై ఆడుతున్నారు.
వైభవ్ అరోరా వేసిన 3 వ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. అయితే 3.4 ఓవర్ క హర్షిత్ రాణా వేసిన బంతికి రాజపక్స(0) పెవిలియన్ చేరాడు. దీంతో పంజాబ్ రెండో వికెట్ కూడా నష్టపోయింది.
మొదటి ఓవర్ లో పంజాబ్ కు 12 పరుగులు వచ్చాయి. ప్రభ్ సిమ్రన్ సింగ్ 3 ఫోర్లు బాదాడు. అయితే మంచి ఫామ్ లో పంజాబ్ కు రెండో ఓవర్ లో షాక్ తగిలింది. హర్షిత్ రాణా వేసిన రెండో ఓవర్ చివరి బంతికి ప్రభ్ సిమ్రన్ సింగ్ (12) అవుట్ అయ్యాడు. దీంతో 2 ఓవర్లకు 21/1 స్కోర్ నమోదైంది.