IPL 2023 DC vs MI: ఐపీఎల్ సీజన్ 16 లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తొలి విజయం అందుకుంది. హ్యాట్రిక్ ఓటమిని రోహిత్ సేన తప్పించుకుని బోణి కొట్టింది. మరో వైపు ఇప్పటికే హ్యాట్రిక్ ఓటమిలు చవిచూసిన ఢిల్లీ క్యాపిటల్స్ కు మరో పరాజయం ఖాతాలో పడింది. లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠ జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తో ముంబై విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచిన ముంబై.. ఢిల్లీని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. 19.4 ఓవరల్లో ఢిల్లీ 172 పరుగులకు ఆలౌట్ అయింది. కెఫ్టెన్ డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలు సాధించారు. ఇక ముంబై బౌలర్లలో స్పిన్నర్ పీయూష్ చావ్లా , పేసర్ బెహ్రన్ డార్ఫ్ చెరో 3 వికెట్లు తీశారు.
రోహిత్, తిలక్ కీలక ఇన్నింగ్స్(IPL 2023 DC vs MI)
అనంతరం ఢిల్లీ ఇచ్చిన 172 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ముంబై 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు సాధించి ఐపీఎల్ తాజా సీజన్ లో తొలి విజయాన్ని అందుకుంది. 45 బంతుల్లో 65 పరుగులు చేసిన రోహిత్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. రోహిత్ తో పాటు తిలక్ వర్మ ( 29 బంతుల్లో 41 ;1 ఫోర్, 4 సిక్స్ లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఢిల్లీ పేలవ ప్రదర్శన
కాగా, వరుసగా నాల్గో మ్యాచులో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఢీలా పడింది. అక్షర్ పటేల్ ( 25 బంతుల్లో 54;4 ఫోర్లు, 5 సిక్స్ లతో) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. డేవిడ్ వార్నర్ ఈ సీజన్ లో మూడో హాఫ్ సెంచరీ సాధించాడు. పృథ్వీ షా (15) ఈసారి కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. మూడో స్థానంలో వచ్చిన మనీశ్ పాండే (18 బంతుల్లో 26; 5 ఫోర్లు) కాస్త ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే 22 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టు కష్టాల్లో పడింది.
చాలాకాలం తర్వాత స్పిన్నర్ పీయూష్ చావ్లా తన సత్తా చాటాడు. వరుసగా మూడు ఓవర్లో మూడు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం వార్నర్ , అక్షర్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ , చివర్లో ఢిల్లీ పూర్తిగా కుప్పకూలింది. 18 ఓవర్లకు 165/5 చేసిన ఢిల్లీ.. తర్వాతి 10 బాల్స్ లో 5 వికెట్లు కోల్పోయింది.
Another result on the final ball of the game 🙌
An epic game to record @mipaltan‘s first win of the season 🔥🔥
Scorecard ▶️ https://t.co/6PWNXA2Lk6 #TATAIPL | #DCvMI pic.twitter.com/u3gfKP5BoC
— IndianPremierLeague (@IPL) April 11, 2023
స్కోర్ల వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) 65, ఇషాన్ కిషన్ 31 (రనౌట్) ; తిలక్ వర్మ 41; సూర్యకుమార్ 0; టిమ్ డేవిడ్ 13 (నాటౌట్) , గ్రీన్ 17 (నాటౌట్),
ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–71, 2–139, 3–139, 4–143.
బౌలింగ్: ముకేశ్ కుమార్ 2–0–30–2, ముస్తఫిజుర్ రెహ్మాన్ 4–0–38–1, నోకియా 4–0–35–0, లలిత్ యాదవ్ 4–0–23–0, అక్షర్ పటేల్ 4–0–20–0, కుల్దీప్ యాద్ 2–0–23-0.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ 51; పృథ్వీ షా 15; మనీశ్ పాండే 26; యశ్ ధుల్ 2; పావెల్ 4(ఎల్బీడబ్ల్యూ) ; లలిత్ 2; అక్షర్ పటేల్ 54; అభిషేక్ 1; కుల్దీప్ 0 (రనౌట్); నోర్జే 5; ముస్తఫిజుర్ 1(నాటౌట్) ;
ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 172.
వికెట్ల పతనం: 1–33, 2–76, 3–81, 4–86, 5–98, 6–165, 7–166, 8–166, 9–166, 10–172.
బౌలింగ్: బెహ్రన్‌డార్ఫ్ 3–0–23–3, అర్షద్ ఖాన్ 1–0–12–0, గ్రీన్ 3–0–30–0, షోకీన్ 4–0–43–1, మెరిడిత్ 3.4–0–34–2, పీయూష్ చావ్లా 4–0–22–3, తిలక్ వర్మ 1–0–7–0.