Site icon Prime9

IPL 2023 DC Vs KKR: ఢిల్లీ వర్సెస్ కోల్‌కతా మ్యాచ్‌కు అంతరాయం.. వర్షం కారణంగా పడని టాస్

IPL 2023 DC Vs KKR

IPL 2023 DC Vs KKR

IPL 2023 DC Vs KKR: ఐపీఎల్ సీజన్ 16 లో భాగంగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, కోలకతా నైట్ రైడర్స్ మధ్య పోరు జరుగనుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. చినుకులు పడుతుండటంతో టాస్ ఆలస్యమైంది. మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో మ్యాచ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

కాగా, సీజన్ మొదలైనప్పటి నుంచి ఢిల్లీ ఆడిన ఐదు మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఈ సీజన్ ఢిల్లీ ఇంకా బోణీ కొట్టలేదు. సొంత మైదానంలో జరుగుతున్నఈ మ్యాచ్ లోనైనా ఢిల్లీ బోణీ కొట్టాలని చూస్తోంది. మరో వైపు ఆడిన 5 మ్యాచుల్లో కోలకతా రెండింటిలో విజయం సాధించింది.

 

పంజాబ్ పై రాయల్స్ విజయం(IPL 2023 DC Vs KKR)

ఐపీఎల్‌ 16 లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మూడో విజయం అందుకుంది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఛేదనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 18.2 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్‌ అయింది. బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. పంజాబ్ మరో ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ ( 30 బంతుల్లో 46 పరుగులు) చేశాడు. తర్వాత బెంగళూరు బౌలర్ల విజృంభణ తో పంజాబ్ వికెట్లు ఒకదాని తర్వాత ఒకటి పడ్డాయి. తర్వాత జితేశ్ శర్మ(27 బంతుల్లో 41 పరుగులు) బాధ్యతతో ఆడి పంజాబ్ ను విజయం వైపు తీసుకెళ్లాడు. కానీ సిరాజ్ తన బౌలింగ్ విరుచుకుపడటంతో మళ్లీ వరుస వికెట్లు పడ్డాయి. దీంతో బెంగళూరు విజయం ఖరారైంది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు తీసుకున్నాడు. హసరంగ 2, పార్నెల్ , హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు.

అంతకు ముందు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (59; 47 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), డు ప్లెసిస్‌ (84; 56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. మ్యాక్స్‌వెల్ (0) డకౌటవ్వగా.. దినేశ్ కార్తిక్‌ (7) మరోసారి విఫలమయ్యాడు. ఆర్సీబీ తొలి వికెట్‌కు కోహ్లీ, డుప్లెసిస్‌ భాగస్వామ్యంలో 137 పరుగులు జోడించారు. పంజాబ్‌ బౌలర్లలో హర్‌ప్రీత్‌ బ్రార్‌ 2, నాథన్‌ ఎల్లిస్‌, అర్ష్‌దీప్‌ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.

 

Exit mobile version