Site icon Prime9

IPL 2023: 1000 ఐపీఎల్ మ్యాచ్ పై సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే..

IPL 2023

IPL 2023

IPL 2023: ముంబై వాంఖేడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు ఒక విషయం ఉంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో 1000వ మ్యాచ్ ఇది. 2008లో ప్రారంభమైన ఈ మెగా టోర్నీ అద్భుతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్‌ సచిన్‌ టెండూల్కర్, రాజస్థాన్‌ రాయల్స్ కోచ్‌ కుమార సంగక్కరను ఐపీఎల్ నిర్వాహకులు స్పెషల్ సత్కరించారు. బీసీసీఐ కార్యదర్శి జై షా చేతుల మీదుగా ప్రత్యేక మెమొంటోలను అందించారు. అదే విధంగా ప్రజెంట్ ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, రాజస్థాన్‌ కెఫ్టెన్ సంజూ శాంసన్‌కూ షీల్డ్‌ను అందజేశారు.

 

ప్రత్యేకంగా సత్కరించి(IPL 2023)

ముంబై తరఫున సచిన్ 6 సీజన్లలో 78 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ఒక సెంచరీ, 13 హాఫ్ సెంచరీలతో మొత్తం 2,334 పరుగులు చేశాడు. కాగా, 2010 ఐపీఎల్ సీజన్‌లో సచిన్‌ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాడు. అప్పుడే 15 మ్యాచుల్లో 618 పరుగులు సాధించి ‘ఆరెంజ్‌’ క్యాప్‌ను కూడా దక్కించుకున్నాడు. ప్రస్తుతం ముంబై జట్టుకు మెంటార్‌గా వ్యహరిస్తున్నాడు. సచిన్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ కూడా ఈ ఏడాది ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

 

 

అదే విధంగా శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర రాజస్థాన్‌ క్రికెట్‌ డైరెక్టర్‌, కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆయన కూడా తొలి సీజన్‌లో ఆడిన కీలక ఆటగాడు. సంగక్కర మొత్తం 71 మ్యాచులు ఆడి.. 1,687 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో సంగక్కర అత్యధిక అత్యుత్తమ స్కోరు 94. ఆయన పంజాబ్‌ కింగ్స్‌, డెక్కన్ ఛార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్‌ ఫ్రాంచైజీలకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. 10 హాఫ్ సెంచరీలను సాధించిన సంగక్కర 2008 మొదటి సీజన్‌లోనే 320 పరుగులు చేశాడు.

 

 

చాలా మంది క్రికెటర్లకు అవకాశాలు

‘ఐపీఎల్‌ చరిత్రలో 1000వ మ్యాచ్‌ను చూడటం మరింత స్పెషల్ గా ఉంది. ఆ మైలురాయిని చేరుకోవడం అద్భుతం. కాలం చాలా వేగంగా సాగుతోంది. ఇలాంటి భారీ టోర్నీని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహిస్తున్న బీసీసీఐకి ప్రత్యేక అభినందనలు. ఐపీఎల్ డవెలప్ అయిన విధానం మాటల్లో వర్ణించలేను. తొలి సీజన్‌ నుంచే నేను ఇందులో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. వరల్డ్ లోనే మెగా టోర్నీ అయిన ఐపీఎల్‌ ద్వారా చాలా మంది క్రికెటర్లకు అవకాశాలు లభించాయి. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు ఛాన్స్‌లు రావడం చూస్తున్నాం’ అని సచిన్ తెలిపాడు.

 

Exit mobile version