Site icon Prime9

Rahul Dravid: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు కరోనా

Rahul Dravid Tests Covid Positive: ఆసియ కప్ కు ముందు టీమిండియాకు షాక్‌ తగిలింది. భారతజట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో ఆసియాకప్ కు ద్రావిడ్ దూరమయినట్లే.

భారత జట్టు జింబాబ్వే పర్యటనను విజయవంతంగా ముగించింది. రాహుల్ ద్రవిడ్ ఇటీవల ముగిసిన 3-మ్యాచ్‌ల సిరీస్ కోసం జింబాబ్వేకు వెళ్లలేదు. జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ వివిఎస్ లక్ష్మణ్ కెఎల్ రాహుల్ నేతృత్వంలోని జట్టుతో కలిసి జింబాబ్వేకు వెళ్లారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగే ఆసియాకప్ కు జట్టు సిద్దమవుతోంది. ఆసియాకప్ లో మొదటి మ్యాచ్ ఆగస్టు 27న శ్రీలంక- ఆఫ్గనిస్తాన్ ల మధ్య జరుగుతుంది. ఆగష్టు 28న భారత్ జట్టు తన దాయది పాకిస్తాన్ తో తలపడుతుంది. ఆసియాకప్ లో పాల్గొనే భారతజట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా, కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. వెన్నుగాయం కారణంగా స్టార్ పేసర్ బుమ్రా జట్టుకు దూరమయ్యాడు.

Exit mobile version