Site icon Prime9

 IND vs PAK: ఇండియా వర్సెస్ పాకిస్థాన్… టికెట్స్ ఫుల్

IND vs PAK t20 world cup match

IND vs PAK t20 world cup match

 IND vs PAK: ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఇష్టపడని క్రికెట్ అభిమానులుండరు. ఆ మ్యాచ్ ఆద్యంతం ఎప్పడు ఏం జరుగుతుందా.. ఎవరెలా ఆడతారా అనే ఆసక్తితో చూస్తుంటారు. మరి అలాంటి మ్యాచ్ చూడడానికి కూడా క్రికెట్ లవర్స్ పెద్దఎత్తున ఆసక్తి చూపుతారు. అయితే టీ20 వరల్డ్ కప్లో భాగంగా అక్టోబర్ 23వ తేదీన ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ కు టికెట్స్ ఫుల్ అయ్యాయి.

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ మ్యాచ్లలకు టికెట్ బుకింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అక్టోబ‌ర్ 23వ తేదీన ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌కు చెందిన టికెట్లు అన్నీ అమ్ముడుపోయాయని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
కాగా అద‌న‌పు స్టాండింగ్ రూమ్ టికెట్లు కూడా క్ష‌ణాల్లోనే సేల్ అయిన‌ట్లు ఐసీసీ పేర్కొనింది. ఆస్ట్రేలియాలో జ‌ర‌గ‌నున్న ఈ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్ కోసం ఇప్ప‌టికే 5 ల‌క్ష‌ల టికెట్లు అమ్ముడుపోయిన‌ట్లు వెల్లడించింది.

క్రికెట్ అభిమానులంద‌రికీ మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్లు ఐసీసీ ప్ర‌క‌ట‌న‌ ద్వారా వెల్లడించింది. ఇప్ప‌టి వ‌ర‌కు 82 దేశాల‌కు చెందిన అభిమానులు వ‌రల్డ్‌క‌ప్ మ్యాచ్‌ల‌ను వీక్షించేందుకు టికెట్లు ముందుగానే కొన్న‌ట్లు ఐసీసీ తెలిపింది.

ఇదీ చదవండి: Jasprit Bumrah: బుమ్రా ఈజ్ బ్యాక్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Exit mobile version