Site icon Prime9

India vs England: నేడు ఇంగ్లాండ్‌తో రెండో వన్డే మ్యాచ్.. సిరీస్‌పై భారత్ గురి!

India vs England 2nd ODI Match in Cuttack: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. కటక్ వేదికగా మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. తొలి వన్డే మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా.. రెండో వన్డే మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకుందుకు ప్రయత్నించనుంది. ఇక, రెండో వన్డేలో మ్యాచ్ గెలిచి సిరీస్‌పై ఆశలు పెంచుకునేందుకు ఇంగ్లాండ్ వ్యూహాలు రచిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ జట్టుకు కీలకంగా మారింది. ఇరు జట్లల్లోనూ ఆటగాళ్లు బలంగా ఉన్నారు.

టీమిండియాలో విరాట్ కోహ్లీ గాయం కారణంగా తొలి వన్డే మ్యాచ్‌లో ఆడలేదు. అయితే రెండో వన్డే మ్యాచ్‌కు రీఎంట్రీ ఇస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కోహ్లీ ఎంట్రీ ఇస్తే.. యశస్వీ జైస్వాల్‌ను తప్పిస్తారా? లేదా జట్టులో ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే కోహ్లీ స్థానంలో తొలి వన్డే ఆడిన శ్రేయస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నాడు. దీంతో ఆయనను తొలగించే అవకాశం లేదు. కాగా, బౌలర్లపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తొలి వన్డే మ్యాచ్‌లో ఓపెనర్లు విఫలమయ్యారు. జైస్వాల్, రోహిత్ ఇద్దరూ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. మరి ఈ మ్యాచ్‌లో రోహిత్ ఫామ్‌లోకి వస్తాడా? అనేది చూడాలి మరి.

Exit mobile version
Skip to toolbar