India Victory: రాయ్ పుర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. చేతిలో మరో 8 వికెట్లు ఉండగానే విజయఢంకా మోగించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. టాస్ గెలించి ఫిల్డింగ్ ఎంచుకున్న ఇండియా.. ప్రత్యర్థి కివీస్ ను New Zealand 108 పరుగులకే ఆలౌట్ చేసింది. లక్ష్య చేధనలో ఇండియా రెండు వికెట్లు కోల్పోయి గమ్యాన్ని చేరుకుంది.
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ సునాయసంగా గెలిచింది. మెుదట బ్యాటింగ్ చేసిన కివీస్ భారత బౌలర్ల ధాటికి 108 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీయగా.. హర్దీక్, సుందర్ చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, కుల్దీప్, ఠాకూర్ చెరో వికెట్ తీశారు. ఇండియా బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ ఆరంభం నుంచే తడబడతూ బ్యాటింగ్ చేసింది.
మ్యాచ్ ప్రారంభంలో షమీ, సిరాజ్ కివీస్ ను చావు దెబ్బ తీశారు.
న్యూజిలాండ్ బ్యాటర్లను వెంటవెంటనే పెవిలియన్ పంపడంతో కేవలం 108 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయింది.
కివీస్ జట్టులో గ్లెన్ ఫిలిఫ్స్.. అత్యధికంగా 36 పరుగులు సాధించాడు.
బ్రాస్ వెల్, సాంటర్న తప్పా మిగతా ఏ ఒక్క బ్యాట్స్ మెన్ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు.
108 పరగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా.. ఆడుతూ పాడుతూ విజయం సాధించింది.
ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధసెంచరీ సాధించాడు. 50 బంతులు ఎదుర్కొన్న రోహిత్..
7 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 53 బంతుల్లో 40 పరుగులు సాధించాడు.
ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. 9 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 11 పరుగులు చేసి సాంటర్న్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇషాన్ కిషన్ తో కలిసి శుభ్ మన్ గిల్ మ్యాచ్ ను పూర్తి చేశారు.
ఇండియా 20 ఓవర్లలో ఈ మ్యాచ్ ను పూర్తి చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో సాంటర్న్, షిప్లే చెరో వికెట్ తీశారు.
రెండో వన్డేలో ఇండియా ఘన విజయం.
ఇంకో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం.
ఈ మ్యాచ్ లో రెచ్చిపోయిన బౌలర్లు.
మూడు వికెట్లు తీసిన మహమ్మద్ షమీ.
బ్యాటింగ్ లో రాణించిన రోహిత్ శర్మ.
తక్కువ పరుగులకే ఔటైన విరాట్ కోహ్లి.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/