Site icon Prime9

IND vs NZ 3rd T20: భారత్ బ్యాటింగ్.. గిల్ సూపర్ సెంచరీ

ind vs nz 2 t20

ind vs nz 2 t20

IND vs NZ 3rd T20: న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి టీ 20లో శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీ సాధించాడు. 56 బంతుల్లో 108 పరుగులు సాధించాడు. ఇందులో 6 సిక్సులు.. 10 ఫోర్లు ఉన్నాయి. భారత్ – న్యూజిలాండ్ మధ్య కీలక పోరుకు సిద్ధమైంది. గడిచిన రెండు టీ20ల్లో చెరో మ్యాచ్ గెలవగా.. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని రెండు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ కీలక పోరుకు.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం వేదికగా మారింది. చివరి పోరులో భారస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

 

రెండు జట్ల మధ్య కీలక పోరు. సిరీస్‌ విజేతను తేల్చే మ్యాచ్‌ ఇదే. ఈ కీలక పోరుకు.. ప్రపంచంలోని అతిపెద్ద మైదానం వేదికైంది. ఈ గ్రౌండ్ లో సుమారు 1.32 లక్షల మది ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించే అవకాశం ఉంది.

బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్..

నరేంద్ర మోదీ స్టేడియం బ్యాటింగ్‌కు బాగ్ అనుకూలంగా ఉంటుందని క్యూరెటర్ తెలిపారు.

అలాగే స్పిన్ కు కూడా సహకరిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

గత మ్యాచ్ మాదిరిగా ఎక్కువ స్పిన్ కు అనుకూలించదని వివరించారు.
బ్యాటర్లు క్రీజులో ఉన్నంతసేపు పరుగుల వరద పారే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ మైదానంలో మొదటి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 174 పైగా ఉంది.

ఇక్కడ జరిగిన ఆరు మ్యాచుల్లో.. మెుదట బ్యాటింగ్ చేసిన జట్టు మూడు సార్లు.. రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు మరో మూడు మ్యాచులు గెలిచాయి.

కివీస్‌తో జాగ్రత్త..

తొలి రెండు మ్యాచుల్లోనూ భారత టాప్‌ ఆర్డర్‌ విఫలం అయ్యారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక ఓపెనర్లు ఇబ్బంది పడ్డారు.

కివీస్ IND vs NZ 3rd T20 స్పిన్నర్ల ధాటికి బ్యాటర్లు వెంటనే వెనుదిరుగుతున్నారు. ఈ మ్యాచ్ కీలకం కావడంతో భారత్ బ్యాటర్లు ఆచి తూచి ఆడాల్సి ఉంది.

ఇక కివీస్ బౌలింగ్ ఆ దేశానికి బలంగా మారనుంది. బ్యాటింగ్ లో రాణించలేకపోతున్న ఆ జట్టు బౌలింగ్ లో జోరుగా రాణిస్తుంది.

 

జట్లు :

భారత్: శుభ్‌మన్ గిల్, ఇషాన్‌ కిషన్ (వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్య (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్‌ మావి, కుల్‌దీప్‌ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్‌ సింగ్

న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డేవన్‌ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, గ్లెన్‌ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైకెల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), ఐష్‌ సోధి, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్‌ టిక్నెర్‌

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version