Site icon Prime9

IND vs NZ 3rd ODI: రోహిత్, శుభ్ మన్ గిల్ సెంచరీలు.. భారత్ భారీ స్కోర్

nz vs ind

nz vs ind

IND vs NZ 3rd ODI: న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్, శుభ్ మన్ గిల్ సెంచరీలతో చెలరేగారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్.. భారీ స్కోర్ దిశగా సాగుతుంది. ఈ ఓపెనర్లు.. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు.

50 ఓవర్లు ముగిసేసరికి భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది. చివర్లో బ్యాటర్లు తడబడటంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.

తొలి వన్డేలో టీమిండియా బ్యాటింగ్‌లో అదరగొట్టగా.. రెండో మ్యాచ్‌లో బౌలింగ్‌తో కివీస్‌ను బెంబేలెత్తించింది. ఇక మూడో వన్డేలోనూ టీమ్‌ఇండియా విజయం సాధించేలా కనిపిస్తోంది. ఈ మ్యాచులో విజయం సాధిస్తే మాత్రం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మూడో స్థానంలో ఉన్న భారత్‌.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే నంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరుతుంది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్.. బ్యాటింగ్ లో రాణిస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ బ్యాటింగ్ లో చెలరేగుతున్నారు. వీరిద్దరు పోటీ పడి పరుగులు చేయడంతో స్కోర్ బోర్డు పరుగులు పెడుతుంది.

మ్యాచ్ ప్రారంభంలో నెమ్మదిగా ఆడిన ఓపెనర్లు.. ఆ తర్వాత రెచ్చిపోయారు. అవకాశం వచ్చినప్పుడల్లా సిక్సులు, ఫోర్లతో చెలరేగారు. దీంతో ఒక్కసారిగా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.

ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. 83 బంతుల్లో ఆరు సిక్సులు, 9 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక మరో బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ సైతం రాణించాడు. 72 బంతుల్లో నాలుగు సిక్సులు, 13 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఓపెనర్లు ఇద్దరు సెంచరీ సాధించడంతో.. భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. ఇదే కొనసాగితే.. నేడు భారత్ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.

టీమిండియా ఓపెనర్ల ధాటికి కివీస్ బౌలర్లు తెలిపోయారు. ప్రతి బౌలర్ దారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు.

శుభ్ మన్ గిల్ ఔటయ్యాక.. భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది.

విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషాన్, సూర్య కుమార్ యాదవ్ తక్కువ పరుగులకే ఔటయ్యారు.

ఓపెనర్ల వికెట్ తీసేందుకు న్యూజిలాండ్ బౌలర్లు శ్రమిస్తున్నారు.

న్యూజిలాండ్ New Zealand బౌలర్ మిచెల్ నాలుగు ఓవర్లలో ఏకంగా 40 పరుగులు సమర్పించుకున్నాడు.

పేసర్లతో పాటు పెద్దగా ప్రభావం చూపని న్యూజిలాండ్ స్పిన్నర్లు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version