IND vs AUS 1st Test: నాగపూర్ వేదికగా టీమిండియా , ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నతొలి టెస్టులో మొదటి రోజే భారత బౌలర్లు చెలరేగి పోయారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 63.5 ఓవర్ల లో 177 పరుగులకే ఆలౌట్ అయింది. భారత స్పినర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ లో చిక్కుకుని ఆసీస్ బ్యాటర్లు విలవిల లాడారు.
రవీంద్ర జడేజా 5 వికెట్లతో విజృంభించగా.. అశ్విన్ 3 వికెట్లు, సిరాజ్, షమీ చెరో వికెట్ తీశారు. కాగా, ఆసీస్ బ్యాటర్లలో మార్నస్ లబుషేన్ 49 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్టీవ్ స్మిత్ 37, అలెక్స్ కేరీ 36 పరుగులు చేశారు.
రీ ఎంట్రీ టెస్టులో రవీంద్ర జడేజా అదరగొట్టాడు. 22 ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా 8 మేడిన్ ఓవర్ల తో 47 పరుగులు ఇచ్చాడు. 5 వికెట్లు తీసిన జడ్డూ టెస్టుల్లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం ఇది 11 సారి. ముఖ్యంగా కీలక సమయంలో మార్నష్ లబుషేన్, స్మిత్ వికెట్లు తీసి టీమిండియా కు బ్రేక్ అందించాడు. దీంతో జడేజా ప్రదర్శన తో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
మాజీ క్రికెటర్లు సైతం జడ్డై అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. నాగపూర్ పిచ్ స్పిన్ కు అనుకూలించడం భారత బౌలర్లకు కలిసొచ్చింది. స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ఆసీస్ బ్యాటర్లను దెబ్బకొట్టారు. స్పిన్ పిచ్ కావడంతో ఇరు జట్టు కూడ తుది జట్టులో స్పిన్నర్లకు ఇంపార్టెన్స్ ఇచ్చాయి. ఆసీస్ ఏకంగా నలుగురు స్పిన్నర్లను ఈ టూర్ కు ఎంపిక చేసింది.
That 𝐌𝐎𝐌𝐄𝐍𝐓 when @imjadeja let one through Steve Smith’s defence! 👌👌
Follow the match ▶️ https://t.co/SwTGoyHfZx #TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/Lj5j7pHZi3
— BCCI (@BCCI) February 9, 2023
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 450 వికెట్లు తీసిన మైలురాయిని చేరుకున్నాడు. నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ క్యారీని ఔట్ చేసి ఈ రికార్డు సాధించాడు అశ్విన్.
కాగా, టెస్టుల్లో ఫాస్టెస్ట్ 450 వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ గా నిలిచాడు. కేవలం 89 టెస్టులో ఈ ఘనత సాధించాడు. ఇంతకుముందు అనిల్ కుంబ్లే 93 మ్యాచ్ లో ఈ రికార్డు ను సాధించాడు. ఓవరాల్ గా ప్రపంచ క్రికెట్ లో 450 వికెట్లు తీసిన 9 వ బౌలర్ గా అశ్విన్ నిలిచాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే కుప్పకూలింది. అనంతరం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో భారత్ 1 వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది.
కెప్టెన్ రోహిత్ శర్మ 56 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. తొలి రోజు ఆట ముగుస్తుందనుకునే టైమ్ లో కేఎల్ రాహుల్ (20) అవుటయ్యాడు. దీంతో క్రీజ్ లో రోహిత్ తో పాటు రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, షమీ, సిరాజ్
ఆసీస్: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖావాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, మ్యాట్ రెన్‌షా, పీటర్ హ్యాండ్‌స్కాబ్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), టాడ్ మర్ఫీ, స్కాట్ బొలాండ్