Site icon Prime9

Ind vs Aus T20: ఆసిస్ మెరుపుదాడికి భారత్ ఓటమి

IND vs AUS T20 First match

IND vs AUS T20 First match

Ind vs Aus T20: ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. భారీ స్కోర్ చేసినా భారత్ కు ఫలితం దక్కలేదు. కొండంత లక్ష్యం కూడా ఆసీస్ బ్యాటర్ల దూకుడు ముందు కరిగిపోయింది. టాస్ నెగ్గిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది.

మొహాలీ మైదానంలో పరుగులు వరదలై పారయనే చెప్పవచ్చు. ఆసిస్ బ్యాటర్లు ఆకాశమేహద్దుగా రెచ్చిపోయి ఆడారు. దానితో భారత్ నిర్దేశించిన 209 పరుగుల భారీ టార్గెట్ ను కేవలం 19.2 ఓవర్లలోనే ఆసీస్ చేధించింది. ఆసీస్‌ 19.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు సాధించి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్గా దిగిన కామెరాన్ గ్రీన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 8 ఫోర్లు, 4 సిక్సులతో 30 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. ఆ తర్వాత మ్యాథ్యూ వేడ్ 21 బంతుల్లో 45, స్టీవెత్ స్మిత్ 24 బంతుల్లో 35 పరుగులతో రాణించారు.

భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3, ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. చాహల్ ఒక వికెట్ తీశాడు. హర్షల్ పటేల్, భువనేశ్వర్ ఇద్దరూ కలిపి 8 ఓవర్లలో 101 రన్స్ ఇవ్వడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఫీల్డర్ల మిస్ క్యాచ్లు కూడా ఇండియా పరాభవానికి మరో కారణం. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మిడిలార్డర్లో వచ్చినా మెరుపుదాడితో ఆసిస్ పై విరుచుకుపడ్డాడు. విధ్వంసక బ్యాటింగ్ తో ఆస్ట్రేలియాకు చుక్కలు కనిపించాడు. కేవలం 30 బంతుల్లో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పాండ్యా సంచలన ఇన్నింగ్స్ సాయంతో టీమిండియా భారీ స్కోరు సాధించిన ఆసిస్ ధాటికి గెలవలేకపోయింది.

ఓపెనర్ దిగిన కేఎల్ రాహుల్ 35 బంతుల్లో 55 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 46 పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 11, కోహ్లీ 2, దినేశ్ కార్తీక్ 6, అక్షర్ పటేల్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కాగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 23న నాగపూర్ లో జరగనుంది.

ఇదీ చదవండి: ICC new rules: క్రికెట్ బంతికి ఉమ్ము రాయడం పై శాశ్వత నిషేధం

Exit mobile version