Site icon Prime9

Hockey World Cup-2023: హాకీ వరల్డ్ కప్ లో బోణి కట్టిన టీమిండియా నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో..? ఎప్పుడంటే?

hockey world cup 2023 team india won against spain

hockey world cup 2023 team india won against spain

Hockey World Cup-2023: హాకీ ప్రపంచ కప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ఒడిశాలోని రూర్కెలాలో జరుగుతున్న ఈ ప్రపంచ కప్ ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.

పూల్-డిలో భాగంగా స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-0తో విజయం సాధించింది. తొలుత నెమ్మదిగా మ్యాచ్‌ను ప్రారంభించిన భారత జట్టు ఆ తర్వాత వేగాన్ని పెంచి ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యాన్ని కనబరిచింది.

11వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను జర్మన్ ప్రీత్ వృథా చేసినప్పటికీ.. ఆ తర్వాత దక్కిన మరో పెనాల్టీ కార్నర్‌ను టీమిండియా సద్వినియోగం చేసుకుంది.

అమిత్ రోహిదాస్ వేగంగా స్పందించి మెరుపు వేగంతో బంతిని గోల్‌పోస్టులోకి పంపి భారత్ ఖాతా తెరిచాడు.

ఆ తర్వాత హార్దిక్ సింగ్ గోల్‌పోస్టు సమీపంలో బంతిని పాస్ చేశాడు. అది ప్రత్యర్థి ఆటగాడి స్టిక్‌కు తగిలి గోల్‌పోస్టులోకి వెళ్లడంతో భారత్‌ 2-0 ఆధిక్యం సాధించింది.

మూడో క్వార్టర్‌లో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంలో భారత్ విఫలమైంది. మరోవైపు స్పెయిన్ గోల చేయకుండా భారత డిఫెన్స్ ఆటగాళ్లు ప్రతిభ కనబరిచారు.

చివరి ఏడు నిమిషాల్లో స్పెయిన్‌కు రెండు పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ.. స్పెయిన్ ఖాతా తెరవలేకపోయింది. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అమిత్ రోహిదాస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

కాగా టీమిండియా తన రెండో మ్యాచ్‌ను జనవరి 15న ఇంగ్లండ్‌తో ఆడనుంది. ఆదివారం రూర్కెలాలోని బిర్సా ముండా అంతర్జాతీయ హాకీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.

భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

జనవరి 15న భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే కీలక మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఇది కాకుండా, మీరు వాచ్ టు హాకీ యాప్, వెబ్‌సైట్‌లో కూడా ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

హాకీ ప్రపంచ కప్ కోసం భారత జట్టు వివరాలు..

హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), పిఆర్ శ్రీజేష్ (గోల్ కీపర్), అర్మన్‌ప్రీత్ సింగ్, సురేంద్ర కుమార్, వరుణ్ కుమార్, అమిత్ రోహిదాస్,

నీలం సంజీప్ జెస్, మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, నీలకాంత్ షార్, షంషేర్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, కృష్ణ పాఠక్ (గోల్ కీపర్), ఆకాష్‌దీప్ సింగ్,

అభిషేక్, సుఖ్‌జిత్ సింగ్, మన్‌దీప్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version