Hardik Pandya-Natasa: టీంఇండియా స్టార్ క్రికెటర్ హార్థిక్ పాండ్యా మరోసారి ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న హార్థిక్ పాండ్యా, తన భార్య నటాషా స్టాంకోవిక్ ఉదయ్ పూర్ లో పెళ్లి కన్నుల పండగా జరిగింది.
వీరిద్దరూ ఇప్పటికే భార్యాభర్తలు కాగా, వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. 2020 లోనే తమ వివాహాన్ని ఈ జంట రిజిస్టర్ చేసుకున్నారు.
కోవిడ్ కావడంతో అప్పుడు పెళ్లికి ఎక్కువ మందిని పిలవలేదు. దీంతో మరోసారి అందరి సమక్షంలో వైభవంగా వివాహ వేడుకను నిర్వహించుకున్నారు.
సంప్రదాయ లుక్ లో నటాషా(Hardik Pandya-Natasa)
తమ కూమారుడు అగస్త్య తో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. మొదట నటాషా విశ్వాసాలకు పాటించి ‘వైట్ థీమ్ వెడ్డింగ్‘ ను జరుపుకోగా..
తర్వాత హిందూ సంప్రదాయ పద్దతిలో నటాషా మెడలో వరమాల వేశాడు హార్థిక్ పాండ్యా.
వైట్ థీమ్ వెడ్డింగ్ లో భాగంగా తెల్లటి గౌన్ ధరించిన నటాషా, వైట్ షర్ట్, బ్లాక్ సూట్ తో పాండ్యా దర్శనమిచ్చారు.
ఇక హిందూ సంప్రదాయంలో ఎరుపు, గోల్డ్ కలర్ లెహంగా, చీరను ధరించిన నటాషా సంప్రదాయ లుక్ లో మెరిసిపోయింది. హార్థిక్ పాండ్యా తన భార్య నుదుట సింధూరం దిద్ది మురిసిపోయాడు.
ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్
మూడేళ్ల క్రితం మేము చేసుకున్న హామీలను మరోసారి పునరుద్ధరించుకోవడం ద్వారా ఈ ప్రేమ దీవిలో వేలంటైన్స్ డేని జరుపుకున్నాం.
ప్రేమ వేడుక జరుపుకునే సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు మా వెంట ఉండడం అదృష్టం’ అంటూ హార్థిక్ పాండ్యా, నటాషా ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
హర్థిక్ పాండ్యా, నటాషా పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.