MI vs SRH: తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ సత్తా చాటింది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో దుమ్ములేపింది. దీంతోపాటు చివరి లీగ్ మ్యాచ్ ను విజయంతో ముగించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ ను ఓటమితో ముగించింది.
ముంబయి ఘన విజయం..
తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ సత్తా చాటింది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో దుమ్ములేపింది. దీంతోపాటు చివరి లీగ్ మ్యాచ్ ను విజయంతో ముగించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ ను ఓటమితో ముగించింది.
వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ముంబయి ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. హైదరాబాద్ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని రెండు ఓవర్లు మిగిలుండగానే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
లక్ష్య ఛేదనలో కామెరూన్ గ్రీన్ (100*; 47 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. మరోవైపు రోహిత్ కూడా రాణించాడు. శర్మ (56; 37 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) చాలా రోజుల తర్వాత అర్దసెంచరీ చేశాడు. చివర్లో సూర్యకుమార్ దూకుడిగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, మయాంక్ దగార్ ఒక్కో వికెట్ పడగొట్టారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో బెంగళూరు ఓటమిపాలైతే ముంబయి 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ఆర్సీబీ గెలిస్తే ఆ జట్టు కూడా 16 పాయింట్లు సాధిస్తుంది. ముంబయి కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్నందున ఆర్సీబీ ముందంజ వేస్తుంది.
సూపర్ బ్యాటింగ్..
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (83; 46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), వివ్రాంత్ శర్మ (69; 47 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో మెరిశారు. క్లాసెన్ (18) పరుగులు చేయగా.. గ్లెన్ ఫిలిప్స్ (1), బ్రూక్ (0)లను నిరాశపరిచారు. సన్వీర్ సింగ్ (4), మార్‌క్రమ్ (13) నాటౌట్‌గా నిలిచారు. ముంబయి బౌలర్లలో ఆకాశ్ మధ్వల్ 4, జోర్డాన్ ఒక వికెట్ పడగొట్టారు.