IPL: ఐపీఎల్ ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ఇప్పటి వరకు ఐపీఎల్ వీక్షించాలంటే.. హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉండాల్సిందే. దీంతో చాలా మంది ఇతర మార్గాల్లో ఐపీఎల్ ను వీక్షించేవారు. ఇప్పుడు ఆ సమస్య తీరనుంది. వచ్చే ఐపీఎల్ మ్యాచ్ లను ఉచితంగా చూడడంతో పాటు.. 4కే రెజల్యూషన్ తో అందుబాటులోకి రానుంది.
భారతదేశంలో ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ వేరు. ఐపీఎల్ కోసం అభిమానులు ఎదురు చూస్తు ఉంటారు. ప్రత్యేకంగా దీనికోసం ఓటీటీ సబ్ స్క్రిప్షన్ కూడా తీసుకుంటారు. కానీ ఈసారి అలాంటి అవసరం ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. ఐపీఎల్ 2023 డిజిటల్ ప్రసార హక్కులను వయాకామ్ 18 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థ జియో సినిమా యాప్ ద్వారా ఉచితంగా ఐపీఎల్ ప్రసార మ్యాచులను వీక్షించే అవకాశం కల్పిస్తోందని ప్రచారం సాగుతోంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని వయాకామ్ ఈ ప్రసార హక్కులను కొనుగోలు చేసింది. దీంతో ఉచితంగా మ్యాచ్ లను ప్రసారం చేయనుందని.. కంపెనీలోని ఇద్దరు ఉన్నతోద్యోగులు తెలిపినట్లు సమాచారం. దీనిని వయాకామ్ ప్రతినిధులు కూడా ధ్రువీకరించినట్లు కథనాలు వెలువడ్డాయి. అధికారికంగా మాత్రం వయాకామ్ 18 నుంచి ప్రకటన రాలేదు.
ఇప్పటి వరకు ఐపీఎల్ మ్యాచులు డిస్నీ హాట్ స్టార్ లో చూసేవాళ్లం. దీనికి ప్రత్యేకంగా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈసారి మాత్రం డిజిటల్ ప్రసార హక్కులను వయాకామ్ 18 కొనుగోలు చేసింది.
జియో సినిమా యాప్ ద్వారా ఐపీఎల్ మ్యాచులను ఉచితంగా ప్రసారం చేయనుంది. ఇటీవలే ముగిసిన ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ తరహాలోనే ఐపీఎల్ మ్యాచులను వీక్షించవచ్చు. అంతే కాకుండా ఇందులో 12 భాషల్లో ప్రసారం చేయనున్నారు. 12 భారతీయ భాషల్లో కామెంటరీ ఉండనుంది.
ఫిఫా వరల్డ్ కప్ సమయంలో జియో సినిమా యాప్ పై విమర్శలు ఎక్కువగా వచ్చాయి. స్ట్రీమింగ్ క్వాలిటీ విషయంలో అభిమానులు అసహానం వ్యక్తం చేశారు. మరోసారి అలాంటి సమస్య రాకుండా.. ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. మ్యాచ్ మధ్యలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. 4కే రెజల్యూషన్ లో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిఫా మ్యాచ్‌ల తరహాలో మల్టీక్యామ్ సాంకేతికతతో వివిధ కోణాల్లో మ్యాచ్ లను వీక్షించే అవకాశం కల్పిస్తుంది.
ఈ ఐపీఎల్ ప్రసారాలను వీక్షకులకు ఉచితంగా అందించనున్నారు. దీనికి కారణం.. వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే. అందుకే మ్యాచ్ లను ఉచితంగా ప్రసారం చేయాలని భావిస్తున్నారు. భారత్ లో గూగుల్, ఫేస్‌బుక్ వంటి వేదికలు ఉచితంగానే సేవలందిస్తూన్నాయి. దీంతో ప్రకటనల వల్ల భారీ ఆదాయాన్ని పొందతున్నాయి. సబ్ స్క్రిప్షన్ సేవల కన్నా.. ఉచితంగా సేవలు అందించేవే మంచి విజయాన్ని సాధించాయి. ఈ కారణం వల్లే వయాకామ్ సైతం ఉచితంగా ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఎక్కువ మందిని ఇంటర్నెట్ సేవల వినియోగంలోకి తీసుకురావాలనేది జియో లక్ష్యం. మరోవైపు 5జీ సేవల్ని ఇటీవలే ప్రారంభించిన జియో.. కస్టమర్లను వేగంగా దాని పరిధిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి కూడా ఇది దోహదం చేయనుంది. ఇక ఐపీఎల్ 2023 మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. దాదాపు ఎనిమిదివారాల పాటు ఈ టోర్నీ కొనసాగనుంది.