Site icon Prime9

ఫిఫా ప్రపంచకప్: లియోనల్ మెస్సీకి గాయం.. ఫిఫా ఫైనల్ కు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ దూరం కానున్నాడా..?

lionel-messi- was injured

lionel-messi- was injured

FIFA World Cup: ఫిఫా ప్రపంచ కప్ టోర్నమెంట్ తుది దశకు చేరింది. ఆదివారం ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ అర్జెంటీనా జట్లు తలపడనున్నాయి. కాగా కప్ కొట్టి తన కెరీర్ కు ఘనమైన వీడ్కోలు పలకాలని ఆశిస్తున్న అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ ఆశ చెదిరేలా కనిపిస్తోంది. మెస్సీ వల్ల అర్జెంటీనా దేశానికి షాక్ తగిలేలా ఉంది. ఈ ఆదివారం నాడు ఫ్రాన్స్ తో జరిగే ఫైనల్ మ్యాచ్ కు మెస్సీ దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. తన అసమాన ఆటతీరుతో ఈ టోర్నీలో అర్జెంటీనాను ఫైనల్ కు తీసుకొచ్చిన మెస్సీ కి తుది పోరుకు ముందు గాయం అయినట్టు తెలుస్తోంది. అయితే క్రొయేషియాతో సెమీఫైనల్ సందర్భంగా మెస్సీ కాలి పిక్క, కండరాల నొప్పితో ఇబ్బంది పడుతూ కనిపించాడు. అంతేకాకుండా గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ కు మెస్సీతో పాటు పలువురు అర్జెంటీనా ప్రధాన ఆటగాళ్లు గైర్హాజరయ్యారు.

దానితో, మెస్సీకి గాయం అయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అతని ఫిట్ నెస్ పై అనుమానాలు మొదలయ్యాయి. తమ దేశ చరిత్రలో మూడోసారి ప్రపంచ కప్ నెగ్గాలని ఆశిస్తున్న అర్జెంటీనా జట్టులో మెస్సీ చాలా కీలక ఆటగాడు. ఇక మెస్సీ ఫైనల్లో లేకపోతే జట్టు డీలా పడిపోయే అవకాశం ఉంది. పైగా, ప్రత్యర్థి జట్టు ఫ్రాన్స్ గత టోర్నీ విజేత. మరి ఈ సారి కూడా ఆ జట్టు మొదటి నుంటి ఆధిపత్యం కనపరుస్తూ అద్భుతంగా రాణిస్తోంది. ఇక, అర్జెంటీనా తరఫున ఈ టోర్నీ ఫైనలే తనకు చివరి మ్యాచ్ అని ఇటీవల మెస్సీ ప్రకటించాడు.

ఇక ముందుగా అందరూ ఊహించనట్లే అర్జెంటీనా-ఫ్రాన్స్ ఫైనల్ కు వెళ్లాయి. ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబపే-అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీల మధ్య రసవత్తర పోరు జరుగనుంది. ఇప్పటి వరకు మొత్తంగా ఫ్రాన్స్ రెండు సార్లు, అర్జెంటీనా రెండు సార్లు ప్రపంచ కప్ సాధించాయి. ఇక ఈ ప్రపంచ కప్ గెలిసే జట్టుకు ఇది మూడో వరల్డ్ కప్ కానుంది. ఈ నేపథ్యంలోనే అర్జెంటీనా తరఫున స్టార్ ఆడగాడిగా ఉన్న మెస్సీ తన కెరీర్ లో ఒక్క ప్రపంచ కప్ ను కూడా కైవసం చేసుకోలేదు.. ఇప్పడైనా ఆ కలను సాకారం చేసుకోవాలనే కసితో ఉన్న సమయంలోనే ఇలా ఆయనపై వార్తలు రావడం ప్రేక్షకులను కాస్త ఆందోళన గురిచేస్తున్నాయి. మరి తుదిపోరులో బరిలోకి మెస్సీ దిగుతాడో లేదో చూడాలి..

ఇదీ చదవండి: లియోనల్‌ మెస్సీ మ్యాజిక్.. అరుదైన రికార్డ్ సాధించిన “గోట్”.. ఫిఫా ప్రపంచకప్ దిశగా అర్జెంటీనా పయనం..!

 

Exit mobile version