FIFA World Cup 2022: ఖతార్ వేదికగా ఫిఫా పురుషుల ప్రపంచ కప్ ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యింది. టోర్నమెంట్ ఆరంభ వేడులను కళ్లు జిగేలు మనిపించేలా అట్టహాసంగా నిర్వహించారు. పలు దేశాలకు చెందిన నాయకులు ఈ వేడుకలకు హాజరయ్యారు. కాగా హాలీవుడ్ ప్రముఖులు ఇచ్చిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఖతార్ సంప్రదాయం ఉట్టిపడేలా కళారూపాలు ప్రదర్శించారు. అయితే అనంతరం భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు జరిగిన ఆరంభ మ్యాచ్ లో ఈక్వెడార్ 2–0 తేడాతో ఆతిథ్య ఖతార్ జట్టును ఓడించి శుభారంభం చేసింది. ఈక్వెడార్ ఆటగాడు వాలెన్సియో ఉత్తమ ప్రతిభ కనపరచి 31వ నిమిషాల్లో రెండు గోల్స్ చేసి తమ జట్టును గెలిపించాడు.
#ECU fans are chanting “queremos cerveza, queremos cerveza!”
Which translates to “we want beer, we want beer!” pic.twitter.com/mQcn6YKVjN
— World Cup Updates (@wc22updates) November 20, 2022
ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ మ్యాచ్ జరుగుతుండగా ఈక్వెడార్ ఆటగాళ్లను సపోర్ట్ చెయ్యడానికి వచ్చిన ప్రేక్షకులు గోలగోల చేశారు. ‘క్వెరెమోస్ సెర్వేజా, క్వెరెమోస్ సెర్వేజా’ అంటూ స్పానిష్ భాషలో అరిచారు. ‘మాకు బీర్లు కావాలి’ అనేది దీని అర్థం. అరబ్ దేశమైన ఖతార్లో బహిరంగ మద్యపానంపై నిషేధం ఉంది. ఫిఫా ప్రపంచ కప్ సందర్భంగా స్టేడియాల్లో బీర్లు సహా మద్యం అమ్మడాన్ని, సేవించడాన్ని ఖతార్ తో పాటు ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్య నిషేధించింది. దీనిపై సాకర్ అభిమానుల తీవ్ర వ్యతిరేకతను కనపరిచారు. ఈ క్రమంలోనే ఈక్వెడార్ ప్రేక్షకులు బీర్లు కావాలంటూ తొలి మ్యాచ్ లో స్టేడియం దద్దరిల్లేలా నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’.. ఆ బంతి విలువు రూ.19.5 కోట్లు