Site icon Prime9

India vs England 2nd ODI: దంచికొట్టిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. టీమిండియాకు భారీ టార్గెట్?

England have won the toss and elected to bat first: ఇంగ్లాండ్, భారత్ జట్లు రెండో వన్డేలో తలపడనున్నాయి. కటక్ వేదికగా జరగనున్న వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచింది. ఈ మేరకు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత జట్టులో రెండు మార్పులు చేస్తున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.

గత మ్యాచ్‌కు దూరమైన భారత్ కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు బదులు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆడనున్నాడు. అలాగే కుల్ దీప్ యాదవ్ స్థానంలో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చేయనున్నాడు. దీంతో వరుణ్ చక్రవర్తి వన్డేల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. ఈ మేరకు ఇంగ్లాండ్‌తో రెండో వన్డే బరిలోకి దిగుతున్న చక్రవర్తికి రవీంద్ర జడేజా క్యాప్‌ను అందించాడు.

ఇంగ్లాండ్ బ్యాటర్లు దంచికొట్టారు. 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(65), జో రూట్(69) హాఫ్ సెంచరీలు చేశారు. చివరిలో లివింగ్ స్టన్(32 బంతుల్లో 41 పరుగులు) చెలరేగడంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసింది.

హ్యారీ బ్రూక్(31), బట్లర్(34), సాల్ట్(26), రషీద్(14) రాణించారు. అయితే చివరి నాలుగు ఓవర్లలో ఇంగ్లాండ్ బ్యాటర్ రషీద్ చెలరేగడంతో 43 పరుగులు వచ్చాయి. కాగా, ఈ మ్యాచ్‌లో ముగ్గురు ఇంగ్లాండ్ బ్యాటర్లు రనౌట్ అయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్, హర్ధిక్, వరుణ్ చక్రవర్తి, షమీ తలో వికెట్ తీశారు.

భారత్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా, షమీ, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లాండ్ జట్టు:
జోస్ బట్లర్(కెప్టెన్), ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టోన్, జేమీ ఓవర్టన్, అట్కిన్‌సన్, రషీద్, మార్క్ వుడ్, మహ్మద్.

Exit mobile version
Skip to toolbar