Site icon Prime9

Delhi capitals: ఇక డేవిడ్ వార్నర్ సారథ్యంలో ..

Delhi capitals

Delhi capitals

Delhi capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi capitals) కెప్టెన్‌గా రిషబ్ పంత్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పంత్‌ గతేడాది డిసెంబర్‌ 30న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పంత్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో ఈ ఏడాది జరిగే పలు మేజర్ టోర్నమెంట్లకు దూరంగా ఉన్నాడు. కాగా, పంత్‌ గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎవరు నడిపించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

 

వైస్‌ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌(Delhi capitals)

ఈ సస్పెన్స్ కు తెరదించుతూ ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ జట్టు సారథి పేరును ప్రకటించింది.

ఐపీఎల్‌-2023 సీజన్‌కు గానూ ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ను కెప్టెన్‌గా నియమించినట్టు వెల్లడించింది.

టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు వైస్‌ కెప్టెన్‌గా అవకాశం ఇచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం.

ఈ మేరకు మేనేజ్ మెంట్ గురువారం అధికారిక ప్రకటన వెలువరించింది.

కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ గతేడాది ఘోర రోడ్డుప్రమాదానికి గురైన విషయం విదితమే.

ఈ నేపథ్యంలో టీమిండియా పలు కీలక సిరీస్‌లతో పాటు ఐపీఎల్‌-2023 సీజన్‌ మొత్తానికీ దూరమయ్యాడు.

దీంతో అతడి స్థానంలో అనుభవం ఉన్న వార్నర్‌ నాయకుడిగా జట్టును ముందుండి నడిపించనున్నాడు.

కాగా గతంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా సేవలు అందించిన వార్నర్‌ 2016 లో ఆ జట్టును చాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే.

 

ఢిల్లీకి గట్టి దెబ్బ

ఇక గతేడాది పద్నాలుగింట ఏడు మ్యాచ్‌లు గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.

ప్లే ఆఫ్స్‌ చేరకపోయినా .. మెరుగైన ప్రదర్శనతో పర్వాలేదనిపించింది.

అయితే, ఈసారి మాత్రం పంత్‌ రూపంలో కెప్టెన్‌తో పాటు కీలక బ్యాటర్‌ సేవలు కోల్పోవడంతో ఢిల్లీకి గట్టి దెబ్బ తగిలింది.

 

మార్చి 31 నుంచి ఐపీఎల్ సందడి

కాగా, మార్చి 31 నుంచి మే 28 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. లీగ్ దశలో 10 జట్ల మధ్య.. మొత్తం 70 మ్యాచ్‌లు జరుగనున్నాయి.

కరోనా ప్రభావంతో.. గతేడాది కేవలం ముంబయి, పుణె, అహ్మదాబాద్‌లో స్టేడియాల్లో మాత్రమే లీగ్ నిర్వహించారు.

కానీ ఈ సారి ప్రతి హోమ్ టీమ్.. సొంత మైదానంలో మ్యాచులు జరగనున్నట్లు బీసీసీఐ తెలిపింది.

ఈ సారి అహ్మదాబాద్ వేదికగా.. గుజరాత్ టైటాన్స్‌ తో చైన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది.

ఏప్రిల్ 1న మొహాలీలో పంజాబ్ కింగ్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

 

హైదరాబాద్ లో ఏడు మ్యాచులు..

కరోనా ప్రభావంతో.. మూడేళ్ల పాటు హైదరాబాద్‌లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరగలేదు.

ఇప్పుడు పరిస్థితులు సాధారణంగా ఉండటంతో.. సొంత మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

ఈసారి హైదరాబాద్‌లో మొత్తం ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా.. ఈ మ్యాచ్ లు జరుగుతాయి.

ఇక్కడ జరిగే మెుదటి మ్యాచ్ లో సన్ రైజర్స్.. రాజస్థాన్ తో తలపడనుంది. రెండో మ్యాచ్ లో పంజాబ్ తో సన్ రైజర్స్ పోటి పడనుంది.

ఈ ఏడాది రాజస్తాన్, పంజాబ్ జట్లు రెండు వేదికల్లో ఆడనున్నాయి.

సొంత మైదానంలో జరిగే ఏడు మ్యాచ్‌ల్లో మొదటి రెండు మ్యాచ్‌ల్ని గుహవతి వేదికగా ఆడనుంది రాజస్తాన్.

ఆపై మిగిలిన ఐదు మ్యాచ్‌ల్ని జైపూర్‌లో ఆడుతుంది. ఇక పంజాబ్ కింగ్స్ మొదటి ఐదు మ్యాచ్‌ల్ని మొహాలీలో చివరి రెండు మ్యాచ్‌ల్ని ధర్మశాలలో ఆడబోతుంది.

ప్రస్తుతం లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే విడుదల చేసిన బీసీసీఐ.. ప్లేఆఫ్స్ షెడ్యూల్, వేదికల్ని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. ఫైనల్ మ్యాచ్ మే 28న జరగనుంది.

ఈ సీజన్‌లో భాగంగా మొత్తం 12 వేదికల్లో 70 లీగ్ మ్యాచ్‌లు 52 రోజుల పాటు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి.

మొత్తం 10 టీమ్స్ తన సొంత మైదానంలో ఏడు మ్యా్‌చ్‌లు, ప్రత్యర్థి మైదానంలో ఏడు మ్యాచ్‌లు ఆడతాయి.

 

Exit mobile version