David Warner: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్ మ్యాచులు జరుగనున్నాయి. వరుసగా రెండు టెస్టులో ఓటమి పాలైన ఆస్ట్రేలియా జట్టుకు వరుస షాక్ లు తగులుతున్నాయి.
మిగతా రెండు టెస్టులకు ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూరం అయ్యాడు. వార్నర్ ఎడమ మోచేతి గాయం కారణంగా సిరీస్ నుంచి వైదలగుతున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది.
టెస్టు సిరీస్ నుంచి వార్నర్ ఔట్
అయితే మార్చి 17 నుంచి ప్రారంభం కానున్న 3 వన్టేల సిరీస్ వార్నర్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నాలుగు టెస్టుల సిరీస్ లో రెండు టెస్టు మ్యాచుల్లో మూడు ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ కేవలం 26 పరుగులే చేశాడు.
ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వార్నర్ కంకషన్‌కు గురయ్యాడు.
ఆ తర్వాత ఎడమ చేతికి బంతి బలంగా తాకింది. అయినా, బ్యాటింగ్ కొసాగించిన వార్నర్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.
రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్ స్థానంలో రెన్‌షా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు.
వరుస ఎదురుదెబ్బలు(David Warner)
ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా మరో స్టార్ పేసర్ హేజిల్‌వుడ్ కూడా సిరీస్ కు దూరమయ్యాడు. గాయం కారణంగా అతను మొదటి రెండు టెస్టులు ఆడలేదు.
సిడ్నీ టెస్టులో అయిన అషిల్లేస్ గాయం నుంచి హేజిల్‌వుడ్ ఇంకా కోలుకోలేదు. దాంతో, అతను స్వదేశానికి తిరిగి వెళ్లాడు.
అతనితో పాటు అష్టన్ అగర్, మ్యాట్ రెన్‌షా కూడా స్వదేశానికి వెళ్లినట్టు సమాచారం.
మరోవైపు మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఆస్ట్రేలియా వెళ్లాడు. అయితే మూడో టెస్టు సమయానికి కమిన్స్ భారత్ తిరిగి రానున్నాడు.
ఒక వేళ కమిన్స్ మార్చి 1 లోపు రాకుంటే స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.
ఇండోర్ వేదికగా మార్చి 1 నుంచి 5 మధ్య మూడో టెస్టు, అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి 13 మధ్య నాలుగో టెస్టు జరుగనున్నాయి.
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్, ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్కార్ట్ గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరమయ్యారు.
వీరిద్దరూ ఇండోర్ టెస్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. టెస్టు జట్టులో మార్పుల గురించి ఆసీస్ బుధవారం అధికార ప్రకటన చేయనుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ వేటలో
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ 2-0 ఆదిక్యంలో ఉంది. ఈ ఏడాది వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడుతోంది.
ఇండోర్ , అహ్మదాబాద్ టెస్టుల్లో ఏదో ఒక మ్యాచ్ గెలిచినా టీమిండియా డబ్యూటీసీ ఫైనల్ కు చేరుతుంది.
ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. రానున్న జూన్ లో ఇంగ్లండ్ లోని ఓవల్ స్టేడియంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.