Yashasvi Jaiswal: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్ కతాపై రాజస్థాన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ లో విధ్వంసం సృష్టించాడు. దీంతో 150 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 13.1 ఓవర్లలో ఛేదించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ జైస్వాల్ శతకాన్ని అడ్డుకునేందుకు చేసిన ఘటన ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
Suyash Sharma attempted to bowl a Wide delivery so that sanju samson can't score fifty
Warra mc bowler pic.twitter.com/GFWAEx7vi4
— supremo (@hyperkohli) May 11, 2023
స్పిన్నర్ పై విమర్శలు.. (Yashasvi Jaiswal)
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్ కతాపై రాజస్థాన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ లో విధ్వంసం సృష్టించాడు. దీంతో 150 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 13.1 ఓవర్లలో ఛేదించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ జైస్వాల్ శతకాన్ని అడ్డుకునేందుకు చేసిన ఘటన ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
ఇక ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. 13 బంతుల్లో 50 పరుగులు చేసి.. వేగవంతమైన అర్ధశతకం నమోదు చేశాడు.
దీంతోపాటు.. ఈ మ్యాచ్ లో సెంచరీ చేజార్చుకున్నాడు. దీనికి కారణం.. కోల్ కతా స్పిన్నర్ సుయాశ్ శర్మ నే కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు.
యశస్వీ శతకాన్ని అడ్డుకునే ఉద్దేశంతో అతడు వైడ్ బాల్ వేసేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ సుయాశ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక మ్యాచ్ 13 ఓవర్లో ఇది జరిగింది. అప్పటికే రాజస్థాన్ 3 పరుగులకు దూరంలో ఉంది. యశస్వి 94 పరుగులతో ఉన్నాడు. ఇంకో సిక్స్ కొడితే సెంచరీ తన ఖాతాలో పడుతుంది.
కానీ క్రీజులో శాంసన్ ఉన్నాడు. సంజు భారీ షాట్ ఆడకుండా.. తర్వాతి ఓవర్లో సెంచరీ పూర్తి చేసుకుంటాడని భావించాడు.
కానీ చివరి బంతికి సుయాశ్ శర్మ.. వైడ్ వేసేందుకు ప్రయత్నించాడు. అది కూడా కీపర్ కి అందకుండా బౌండవీ వెళ్లేలా వేశాడు.
అదే జరిగి ఉంటే జైస్వాల్ 94 వద్దే ఉండిపోయేవాడు.
గుర్తించిన శాంసన్..
చివిరి బంతిని నెమ్మదిగా ఆడాలాని శాంసన్ భావించాడు. కానీ సుయాష్ శర్మ బంతిని వైడ్ వేశాడు. బంతి గమనాన్ని గుర్తించిన సంజు.. వైడ్ వెళ్లకుండా అడ్డుకున్నాడు.
ఆ తర్వాత యశస్వి వైపు చూస్తూ సిక్స్ బాదేసెయ్ అంటూ సైగ చేశాడు.
తర్వాతి ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ తొలి బంతిని వైడ్ యార్కర్ వేసే ప్రయత్నం చేయగా.. జైస్వాల్ స్క్వేర్ లెగ్ మీదుగా బౌండరీకి తరలించి రాజస్థాన్‌కు విజయాన్నందించాడు.
దీంతో యశస్వి 98 పరుగుల వద్ద ఆగిపోయాడు. అయితే సెంచరీకి చేరువలో జైస్వాల్ ఉన్నా.. మరోవైపు శాంసన్ ఫోర్లతో స్కోరు బోర్డు పరిగెత్తించడం గమనార్హం.
ఇక మ్యాచ్ అనంతరం యశస్వి మాట్లాడుతూ.. సెంచరీ చేయాలన్నది తన ఆలోచన కాదని, జట్టు నెట్ రన్‌రేట్‌ను పెంచడం కోసమే దూకుడుగా ఆడినట్లు చెప్పాడు.
‘‘మ్యాచ్ కోసం నేను సంసిద్ధమయ్యా. నా మీద పూర్తి విశ్వాసంతో ఆడా. మంచి ఫలితం వస్తుందని నాకు తెలుసు. ఎప్పుడూ మ్యాచ్‌ను నేనే పూర్తిచేయాలని కోరుకుంటా.
గెలవడమే నా సిద్ధాంతం. ఈ మ్యాచ్‌లో నెట్ రన్‌రేట్‌ను ఒక్కటే దృష్టిలో పెట్టుకుని ఆడా. నేనూ సంజూ కలిసి వీలైనంత త్వరగా మ్యాచ్‌ను ముగించాలని అనుకున్నాం’’ అని చెప్పాడు.