Site icon Prime9

Cristiano Ronaldo: సౌదీ అరేబియా క్లబ్ తో ఒప్పందం కుదుర్చుకున్న క్రిస్టియానో రొనాల్డో

Cristiano Ronaldo

Cristiano Ronaldo

Cristiano Ronaldo: పోర్చుగల్ ఫుట్ బాల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో సౌదీ అరేబియా యొక్క అల్ నాసర్ క్లబ్ తో రెండున్నర సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసాడు. రొనాల్డో ఒప్పందం “200 మిలియన్ యూరోలు (USD 214.04 మిలియన్లు)” విలువైనదని తెలుస్తోంది. దీనితో అతను ప్రపంచంలోనే ఖరీదైన ఫుట్ బాల్ ఆటగాడిగా నిలిచాడు. నవంబర్‌లో ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో రోనాల్డో మాజీ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్‌తో అతని ఒప్పందంముగిసింది.

అల్ నాసర్ కోసం సంతకం చేయాలనే తన నిర్ణయం గురించి మాట్లాడుతూ, రొనాల్డో ఆసియాకు వెళ్లడానికి ఇది సరైన సమయమని చెప్పాడు. ఖతార్‌ ప్రపంచ కప్‌లో ముందుగానే నిష్క్రమించినప్పటికీ పోర్చుగల్‌కు ఆడటం కొనసాగిస్తానని రొనాల్డో సూచించాడు. 37 ఏళ్ల రొనాల్డో, 2026లో జరిగే తదుపరి ప్రపంచ కప్ వరకు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో కొనసాగే అవకాశం లేదు. యూరోపియన్ ఫుట్‌బాల్‌లో నేను గెలవాలని అనుకున్న ప్రతిదాన్ని గెలుచుకున్నందుకు నేను అదృష్టవంతుడిని మరియు ఆసియాలో నా అనుభవాన్ని పంచుకోవడానికి ఇదే సరైన తరుణం అని భావిస్తున్నాను అని రొనాల్డో అన్నాడు. నేను నా కొత్త సహచరులతో చేరడానికి ఎదురు చూస్తున్నాను.వారితో కలిసి క్లబ్ విజయాన్ని సాధించడంలో సహాయపడతానని పేర్కొన్నాడు.

రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్‌తో 3 ప్రీమియర్ లీగ్ టైటిళ్లను మరియు FA కప్‌తో పాటు ఛాంపియన్స్ లీగ్‌ను గెలుచుకున్నాడు, రొనాల్డో 2009-18 వరకు రెండు లాలిగా టైటిల్‌లు, రెండు స్పానిష్ కప్‌లు, నాలుగు ఛాంపియన్స్ లీగ్ టైటిల్‌లు మరియు మూడు క్లబ్ ప్రపంచ కప్‌లను గెలుచుకున్నాడు.

 

Exit mobile version