Site icon Prime9

Aadi Saikumar: టీమిండియాకు అండగా నిలిచిన టాలీవుడ్ హీరో

aadi-saikumar-team-india

Asia Cup 2022: శ్రీలంక పై టీమిండియా ఓడిపోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోస్టలు పెడుతున్నారు. టీమిండియా  ఓటమిని క్రికెట్ అభిమానులు  తీసుకోలేకపోతున్నారు. టీమిండియా ఆసియా కప్ ఫైనల్ ఆశలు ఆవిరయ్యాయి. అలాగే  సూపర్-4లో  భాగంగా వరసగా  రెండు సార్లు ఓడిపోయింది. ఫైనల్ కు వెల్లడానికి ఇప్పుడు అవకాశాలు కూడా లేకుండా పోయాయి.  పాకిస్థాన్ , శ్రీలంక పై  ఆఖరి వరకు పోరాడిన ప్రయోజనం లేకుండా పోయింది. పాకిస్థాన్ మ్యాచ్‌లో టీమిండియా  బెస్ట్ ఇచ్చిన  చివరకి ఓటమి పాలవ్వాలిసింది శ్రీలంక పై ఎక్కువ పరుగులు  కొట్టి ఉంటే  గెలిచే వాళ్ళు  కానీ మనం ఒకటి అనుకుంటే అక్కడ మ్యాచ్ ఆడే  సమయానికి ఇంకోలా  అయి ఓటమిని అంగీకరించాలిసి వచ్చింది. రెండు మ్యాచ్ లు  ఓడిపోవడానికి  కారణం చివర 19, 20 ఓవర్లు. ఇప్పుడు టీమిండియా ఫైనల్ వరకు వెళ్లాలంటే ఒక్కటే దారి  పాకిస్థాన్ ఆడబోయే రెండు మ్యాచ్లు  ఓడిపోయి, ఆఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా గెలిస్తే అప్పుడు నెట్ రన్‌రేట్ పెరిగి టీమిండియా ఫైనల్ వెళ్తుంది.

ప్రస్తుతం టీమిండియా ఓటమి పై సోషల్ మీడియాలో  ట్రోల్స్ వస్తున్నాయి. టాలీవుడ్  హీరో ఆది సాయి కుమార్ ట్విట్టర్ వేదికగా ట్రోల్స్ ను ఖండించారు ” రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయినంత మాత్రం వాళ్ళని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని, ఓడిపోయిన రెండు మ్యాచ్‌లు ఆట అయిపోయే సమయానికి మన వాళ్ళు 15 పరుగులు తక్కువ చేయడం వల్లే  ఓడిపోయారని ” ట్వీట్ చేసాడు.

 

Exit mobile version