Prime9

Sri Lanka: క్రికెట్ జట్టులో ఆసక్తికర ఘటన.. ఆ ముగ్గురిదీ ఒకేరోజు పెళ్లి

Sri Lanka: శ్రీలంక క్రికెట్ జట్టులో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒకేరోజు ముగ్గురు క్రికెటర్లు వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. పథుమ్ నిస్సంక, కసున్ రజిత, చరిత్ అసలంక వంటి స్టార్ ప్లేయర్స్ ఒకే రోజు పెళ్లి చేసుకుని వారి బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. నేడు కొలొంబో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో వీరు ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ముగ్గురు క్రికెటర్ల వివాహాల ఫొటోలను శ్రీలంక క్రికెట్ బోర్డు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. మరియు ఆ క్రికెటర్లకు శుభాకాంక్షలు తెలిపింది.

ప్రస్తుతం శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య సిరీస్ జరుగుతుండగానే ఈ క్రికెటర్లు పెళ్లిపీటలెక్కారు. వీరికి శ్రీలంక క్రికెట్ బోర్డుతో పాటు అభిమానులు సైతం శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదీ చదవండి: ఒకే ఓవర్లో 7 సిక్సులు.. చరిత్ర సృష్టించిన యువ క్రికెటర్

Exit mobile version
Skip to toolbar