Site icon Prime9

T20 Cricket : కొత్త రికార్డును సృష్టించిన టీమిండియా కెప్టెన్‌

rohith sharma prime9news

rohith sharma prime9news

T20 Cricket : భారత్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీ20 ఆల్ ఫార్మట్లో ఒక కొత్త రికార్డును సృష్టించాడు. మహిళా విభాగం, పురుషులు విభాగం రెండింటిలో టీ20 లో ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్ గా రోహిత్‌ నిలిచాడు.అలాగే ఆసియాకప్‌-2022లో మొన్న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ తో 28 పరుగులు కొట్టి ఈ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అంతక ముందు వరకు ఈ రికార్డు న్యూజిలాండ్‌ క్రికెటర్ బ్యాటర్‌ సుజీ బేట్స్ 3531 పరుగులతో ఉంది.

ఒక్క మ్యాచ్ తో రోహిత్‌ శర్మ ఏకంగా 3548 పరుగులు చేసి క్రికెట్లో తన కంటూ ప్రత్యేక చెరగని ముద్ర వేసుకొని ఈ రికార్డును సృష్టించాడు. ఇప్పటి వరకు రోహిత్ టీ20 కెరీర్‌లో 127 మ్యాచ్‌లు ఆడగా 3548 పరుగులు చేసి హిట్ మ్యాన్ గా పేరు పొందిన రోహిత్ ఈ 127 మ్యాచ్లో 27 హాఫ్‌ సెంచరీలలు మరియు 4 సెంచరీలు ఉన్నాయి. పురుషుల విభాగంలో టీ20 క్రికెట్‌లో ఎక్కువ పరుగుల చేసిన రికార్డుల లిస్టులో రోహిత్‌ 3548 పరుగులతో మొదటి స్తానంలో ఉన్నారు.  రెండవ స్తానంలో గప్టిల్‌ 3497 పరుగులు, మూడో స్తానంలో కోహ్లి 3462 పరుగులతో ఉన్నారు.

Exit mobile version