Prime9

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో నేటి నుంచి రసవత్తర పోరు స్టార్ట్

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2022 పోరు నేటి నుంచి ప్రారంభం కానుంది. సూపర్-12 రౌండ్ మ్యాచ్లు ఈ రోజు నుంచి ప్రారంభం అవనున్నాయి. గత ఏడాది టీ 20 ప్రపంచ కప్‌లో ఫైనలిస్టుల మధ్య మ్యాచ్‌తో ఈ రౌండ్ ప్రారంభమవుతుంది.

ఈ మ్యాచ్ లో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. సిడ్నీ వేదికగా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ మ్యాచ్ స్టార్ అవుతుంది.
టీ20 వరల్డ్‌కప్‌ 2022 అక్టోబర్ 16 నుంచి ప్రారంభమైనప్పటికీ, తొలి రౌండ్ (క్వాలిఫయింగ్) మ్యాచ్లు అక్టోబర్ 16 నుంచి 21 వరకు జరిగాయి. 8 జట్ల మధ్య 12 మ్యాచ్‌లు జరగ్గా, ఆ తర్వాత నాలుగు జట్లు సూపర్ -12లో చోటు దక్కించుకున్నాయి. వీటిలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి 8 జట్లు ఉన్నాయి. సూపర్ -12 కోసం జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో 6-6 జట్లు ఉంటాయి. ఈ సూపర్-12 రౌండ్ లో మొత్తం ౩౦ మ్యాచ్ లు జరుగుతాయి.

పిచ్, వాతావరణం

పిచ్ ఇరుజట్ల ఆటగాళ్లకు అనుకూలంగా ఉంటుంది. కాగా మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం 90% ఉంది.

రెండు జట్ల లైన్ అప్

ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్వుడ్.

న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ విల్లీ, కొలిన్ మున్రో, జిమ్మీ నీషమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే, ఇష్ సోధి.

ఇదీ చదవండి టీ20 వరల్డ్ కప్ నుంచి వెస్టిండీస్ ఔట్

Exit mobile version
Skip to toolbar