Site icon Prime9

Shubman Gill : శుభ్‌మన్ గిల్ క్రష్ ఎవరో చేప్పేశాడుగా.. సారా అలీఖాన్ ? సారా టెండూల్కర్ ?? ఇద్దరూ కాదు???

shubman gill opens about his crush and news got viral

shubman gill opens about his crush and news got viral

Shubman Gill : ఇండియన్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం మంచి ఫామ్ లో దూసుకుపోతూ కెరీర్ పరంగా జోష్ లో ఉన్నాడు,. ప్రొఫెషనల్ పరంగా గిల్ మంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. పర్సనల్ గా కూడా అదే రేంజ్ లో ఎపుడు వార్తల్లో ఉంటాడు ఈ యంగ్ క్రికెటర్. ముఖ్యంగా శుభ్‌మన్, సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి. అలానే ప్రముఖ బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తుంటాయి. అయితే నెటిజన్లు మాత్రం శుభ్‌మన్ పేరును సారా టెండూల్కర్ తో ఎక్కువగా లింక్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఉంటారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. తన క్రష్ పేరును వెల్లడించాడు. ఈ ఆన్సర్‌తో నెటిజన్లతోపాటు అభిమానులకు కూడా గట్టి షాక్ ఇచ్చాడు గిల్. సారా అలీ ఖాన్ లేదా సారా టెండూల్కర్ మాత్రం కాదని, దక్షిణాదికి చెందిన ప్రముఖ నటి తన క్రష్ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఫుల్ ట్రెండింగ్ అవుతుంది.

నా క్రష్ ఆమెనే.. అని క్లారిటీ ఇచ్చిన శుబ్ మన్ (Shubman Gill)..

ఆ ఇంటర్వ్యూ లో ‘మీకు ఇష్టమైన నటి ఎవరు?’ అంటూ గిల్‌ను ప్రశ్నించగా.. ఆయన సమాధానమిస్తూ, ‘రష్మిక మందన్న’ నా క్రష్ అంటూ బదులిచ్చాడు. కాగా, గతేడాది శుభ్‌మాన్‌ను ఓ ఇంటర్వ్యూలో ‘బాలీవుడ్‌లో మీకు ఇష్టమైన నటి ఎవరు?’ అంటూ అడిగితే.. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే సారా అంటూ బదులిచ్చాడు. అలాగే ‘మీరు సారాతో డేటింగ్ చేస్తున్నారా?’ అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, ‘అవును, కాకపోవచ్చు’ అంటూ సంధిగ్ధంలో పడేశాడు. ఇక ఇప్పుడు “సారా”లు ఇద్దరూ కాకుండా రష్మిక పేరు చెప్పడం పట్ల షాక్ అవుతున్నారు.

ఇక రష్మిక గురించి చెప్పాలంటే.. నేషనల్ క్రష్ గా పేరు పొంది అందరికి సూపరిచితురాలు అయ్యింది. ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హెరోయిన్ గా మారింది. ఇక డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా క్రేజ్ సంపాదించుకుంది రష్మిక. ఈ మూవీతో దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ పెంచుకుంది. దీంతో అటు దక్షిణాది లోనే కాకుండా బాలీవుడ్ లోనూ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.

అయితే కొంతకాలం క్రితం ఒక ఇంటర్వ్యూలో ‘కాంతార’ సినిమా చూశారా అని ఒక యాంకర్ ప్రశ్నించగా… లేదు చూడలేదు అంటూ బదులిచ్చింది. ఇక ఆ తర్వాత పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తనను పరిచయం చేసిన నిర్మాణ సంస్థ పేరు చెప్పకుండా సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ అంటూ వేళ్లతో చూపించింది. ఇక రష్మిక తీరుపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రిషబ్ శెట్టి సైతం రష్మికకు కౌంటరివ్వడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలోనే రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. ఈ వివాదం పై స్పందించిన రష్మిక
కన్నడ చిత్ర పరిశ్రమ నాపై ఎలాంటి నిషేధం విధించలేదు అంటూ.. తనదైన రీతిలో స్పందించి ఆ వివాదాన్ని ఆపే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యింది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version