Shubman Gill : హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది.
అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ కివీస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు.
హ్యాట్రిక్ సిక్సులతో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో 208 పరుగులు చేశాడు.
వన్డేలో డబుల్ సెంచరీ చేసిన 5వ భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. అంతకముందు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేశారు.
తన కెరీర్ లో 19వ వన్డే ఆడుతున్న గిల్.. కెరీర్ లో వెయ్యి పరుగుల మైలురాయిని దాటేశాడు.
అత్యంత వేగంగా వన్డేల్లో 1000 పరుగులు చేసిన భారత బ్యాటర్ గా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.
కోహ్లీ 24 వన్డేల్లో వెయ్యి రన్స్ చేయగా.. గిల్ 19 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్ లో కోహ్లీ (8), ఇషాన్ కిషన్ (5), రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్ (31), హార్దిక్ పాండ్య (28), వాషింగ్టన్ సుందర్ (12), శార్దూల్ ఠాకూర్ (3), కుల్దీప్ యాదవ్ (5), షమి (2) పరుగులు చేశారు. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసి న్యూజిలాండ్‌కు 350 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారీ టార్గెట్ ని చేధించడానికి దిగిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు విజయం సాధించి టీం ఇండియాని గెలిపించారు.
వైరల్ గా గిల్ (Shubman Gill), సచిన్, సారా మీమ్స్..
అయితే గిల్ అద్బుత ఇన్నింగ్స్ తో చెలరేగడంతో సోషల్ మీడియా వ్యాప్తంగా అభినందిస్తూ ప్రజలు పోస్ట్ లు పెడుతున్నారు.
మరోవైపు క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ తో గిల్ రిలేషన్ లో ఉన్నాడనే వార్తలు గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి.
ఈ తరుణంలోనే వీరికి సంబంధించిన ఫోటోలను మీమ్స్ గా చూసి పోస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతున్న ఈ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి..
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/