Site icon Prime9

Shikhar Dhawan: బాలీవుడ్ భామతో శిఖర్ ధావన్ రొమాన్స్ .. అసలు కథ ఏంటంటే !

shikhar dhawan prime9news

shikhar dhawan prime9news

Shikhar Dhawan: శిఖర్ ధావన్ సారథ్యంలో టీమిండియాకు కెప్టెన్ గా సౌతాఫ్రికాను  సొంతగడ్డపై  మట్టికరిపించింది.ఈ సిరీస్ 2-1 తేడాతో సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది.ధావన్ బ్యాటర్ గా ఫెయిల్ అయినా..కెప్టెన్ గా మాత్రం మంచి మార్కులు సంపాదించాడు ఈ గబ్బర్.

ఐతే ఈ మధ్య కాలంలో ఈ స్టార్ ఓపెనర్ గురించి ఓ కొత్త వార్తా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.ఆ వార్త మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కంటెంట్ చివరి వరకు చదవండి.ఈ గబ్బర్ త్వరలోనే బాలీవుడ్ తెరపై మెరవనున్నాడని తెలిసిన సమాచారం.సూపర్ స్టార్ రజినీకాంత్ తో హీరోయిన్లుగా చేసిన హ్యూమా ఖురేషి (కాలా), సోనాక్షి సిన్హా (లింగ)లతో కలిసి అతడు చిందులేయబోతున్నాడని తెలిసింది.

సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘Double XL ‘ సినిమాలో శిఖర్ ధావన్‌ అతిథి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక ఫొటో సోషల్‌ మీడియాను ఒక ఊపు ఉపేస్తుంది.ఈ ఫొటోలో శిఖర్ ధావన్‌.. హ్యూమాతో కలిసి డ్యాన్స్‌ చేస్తున్నాడు.ఈ ఫొటోను హ్యూమా రీట్వీట్‌ చేయడంతో గబ్బర్ ను అతి త్వరలో వెండితెర మీద చూడబోతున్నామని స్పష్టమైంది.

Exit mobile version
Skip to toolbar