Site icon Prime9

AUS v NZ 2022: బ్యాటర్లు తికమక.. రన్ అవుట్ జస్ట్ మిస్

Cricket News

Cricket News

AUS v NZ 2022: శుక్రవారం నాడు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో ఆసిస్ విజ‌యం సాధించింది. అయితే ఆ మ్యాచ్‌లో ఓ గ‌మ్మ‌త్తు సన్నివేశం జ‌రిగింది. అది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

కివిస్ మరియు కంగారూ జట్టులకు మధ్య నిన్న జరిగిన రెండో వన్డే మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. కాగా ఈ మ్యాచ్లో కివీస్ బ్యాట‌ర్ల‌ను ర‌నౌట్ చేసే స‌మ‌యంలో తికమకగా పరుగులు పెడుతూ కన్ఫ్యూజ్ అయ్యారు పిచ్ మీద ఉన్న కివీస్ బ్యాటర్లు. కివిస్ ప్లేయర్ కేన్ విలియ‌మ్‌స‌న్ క‌వ‌ర్స్‌లోకి బంతిని కొట్టి ఒక ప‌రుగు తీయాల‌నుకున్నాడు. కానీ నాన్ స్ట్ర‌యిక‌ర్ ఎండ్‌లో ఉన్న దేవాన్ కాన్‌వా మాత్రం ముందుకు క‌ద‌ల‌ లేదు. ఫీల్డింగ్లో ఉన్న సీన్ అబ్బాట్‌ క్యాచ్ మిస్ చెయ్యడం. అదే సమయంలో ఇద్దరు బ్యాటర్లు ఒకే వైపు పరుగు తియ్యడం స్టేడియంలో ఉన్న క్రికెట్ లవర్స్ కి ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.

కానీ అబ్బాట్ బాల్ ను అందుకోకపోవడంతో, మ‌ళ్లీ ఇద్ద‌రు బ్యాట‌ర్లు సరిగ్గా స్ట్ర‌యిక‌ర్ వైపు ప‌రిగెత్తి రన్ చేశారు. ఈ క్రమంలో కీప‌ర్ కేరీ బంతిని వికెట్ల‌కు కొట్ట‌డంలో విఫ‌లం అయ్యాడు. దీనితో విలియ‌మ్‌స‌న్ ర‌నౌట్ ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నాడనే చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో 196 పరుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ 82 పరుగులకే ఆలౌటైంది.

ఇదీ చదవండి: వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన ఆరోన్ ఫించ్

Exit mobile version