Asia Cup: ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 8వ సారి ఆసియాకప్ విజేతగా భారత్ నిలిచింది. భారత బౌలర్ల దాటికి శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. 51 పరుగుల విజయ లక్ష్యాన్ని 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని భారత్ చేధించింది.
50 పరుగులకే శ్రీలంక ఆలౌట్..(Asia Cup)
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకేయులను భారత బౌలర్లు 50 పరుగులకు ఆల్ ఔట్ చేశారు. సిరాజ్ 21 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసాడు. హర్దిక్ పాండ్య 3 పరుగులు ఇచ్చి 3 మూడు వికెట్లు తీయగా., బూమ్రా ఒక వికెట్ తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన శుభమల్ గిల్ , ఇషాన్ కిషన్ 6 ఓవర్లలో లక్ష్యన్ని చేధించి టైటిల్ సాధించారు. శ్రీలంక చేసిన 50 పరుగులు వారి రెండవ అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అంతేకాదు వన్డే ఇంటర్నేషనల్స్‌లో భారత్‌పై ఏ జట్టు నమోదు చేయని అత్యల్ప స్కోరు.శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఐదుగురు ఆటగాళ్లు పెరీరా, సమర విక్రమ, అసలంక, శనాకా, పతిరణ డకౌట్ అయ్యారు.
ఒకే ఓవర్ లో 4 వికెట్లు తీసిన సిరాజ్..
లంకేయులను భారత్ బౌలర్ సిరాజ్ ముప్పుతిప్పలు పెట్టాడు. తను వేసిన ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసి లంకేయులను దిక్కుతోచని స్థితికి తీసుకొచ్చాడు. అప్పటికి లంక కేవలం 30 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత బంతిని తీసుకున్న హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీసాడు. బూమ్రా ఒక వికెట్ తీశాడు. మన బౌలర్ల దాటికి 17వ ఓవర్లో లంక ఆఖరి వికెట్ కోల్పోయి. 50 పరుగుల వద్ద కుప్పకూలింది.