ENG vs IND: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీ తుది దశకు చేరుకుంది. దాదాపు నెలరోజులుగా జరుగుతున్న ఈ మెగాటోర్నీలో ప్రపంచ విజేత ఎవరు అనేది మరో రెండు మ్యాచ్‌ల్లో తేలనుంది. ఇప్పటికే సెమీస్ లో న్యూజిలాండ్‌ను ఓడించిన పాకిస్థాన్ ఫైనల్ చేరగా, నేడు ఇంగ్లండ్‌తో అమీతుమీకి భారత్ సిద్ధమైంది. అన్నీ అనుకూలిస్తే ఆడిలైడ్‌లో రోహిత్‌సేన కొత్త చరిత్ర లిఖించడం ఖాయమని తెలుస్తోంది. 15 ఏండ్ల సుదీర్ఘ కల సాకారానికి. కోట్లాది మందిఅభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న వేళ టీ20 ప్రపంచకప్‌లో భారత్ కీలక సమరానికి సమరశంఖం పూరించింది. ఐసీసీ మెగాటోర్నీల్లో నాకౌట్ బలహీనతను అధిగమించి ఫైనల్లోకి దూసుకెళ్లాలని టీమ్‌ఇండియా ఆరాటపడుతున్నది. ఇక ఈ కీలకమైన సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించేందుకు భారత్ పక్కా ప్రణాళికను సిద్దం చేసుకుంటుంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ లలో విజయం కనపరుస్తూ జోరు మీదున్న టీమిండాయా అదే విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగిస్తూ పరిస్థితులకు అనుగుణంగా తగు మార్పులు చేర్పులు చేస్తూ విజయకేతనం ఎగురవెయ్యాలని ఉవ్విల్లూరుతుంది. మరి నేటి మెగా టోర్నీలో విజయం ఎవరిని వరించనుందో వేచి చూడాలి.
భారత్ తుది జట్టు అంచనా: రోహిత్‌శర్మ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్‌పాండ్యా, కార్తీక్/పంత్, అక్షర్‌పటేల్, అశ్విన్, భువనేశ్వర్, షమీ, అర్ష్‌దీప్‌సింగ్
ఇంగ్లండ్ తుది జట్టు అంచనా: బట్లర్(కెప్టెన్), హేల్స్, మలన్/సాల్ట్, స్టోక్స్, బ్రూక్, లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ కరాన్, వోక్స్, జోర్డాన్, అదిల్ రషీద్.
ఇదీ చదవండి:ఐసీసీ T20 ర్యాంకింగ్స్.. టాప్ టెన్ లో కోహ్లికి దక్కని స్దానం