First Oneday: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. లక్నో వేదికగా నేడు తొలి వన్డేలో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. కాగా రోహిత్ శర్మ సారథ్యంలో భారత సీనియర్ జట్టు టీ20 ప్రపంచకప్-2022 కోసం ఆస్ట్రేలియాకు వెళ్లనుండడంతో.. భారత ద్వితీయ శ్రేణి జట్టు ఈ సిరీస్‌లో తలపడనుంది.
ఈ జట్టుకు భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారధ్యం వహించనున్నాడు. అదే విధంగా రజిత్ పాటిదార్, ముఖేష్ కుమార్‌కు తొలి సారిగా టీమిండియాలో చోటు దక్కింది. తొలివన్డేలో ఓపెనర్లగా ధావన్, శుబ్‌మాన్ గిల్ రానున్నారు. గిల్ ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విండీస్, జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో అదరగొట్టాడు.
ఇక ధావన్ కూడా పర్వాలేదనిపిస్తున్నాడు. ధావన్ ఆడిన అఖరి ఆరు వన్డేల్లో 322 పరుగులు సాధించాడు. ఇక మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠికి చోటు దక్కే అవకాశం కన్పిస్తుంది. మరోవైపు రజిత్ పాటిదార్ భారత్ తరపున అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అదే విధంగా ఆల్ రౌండర్ల కోటాలో షబాజ్ ఆహ్మద్, శార్థూల్ ఠాకూర్‌కు చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఇక చివరగా మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్‌కు బౌలర్ల కోటాలో ఎంపికయ్యే అవకాశం కన్పిస్తోంది.