IND vs AUS T20: ఇండియా ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఆసీస్ చేతిలో ఒక మ్యాచ్ ఓటమితో ఉన్న ఇండియాకు ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. అయితే ఈ మ్యాచ్ కూడా గెలిసి 2-0తో సిరీస్ దక్కించుకోవాలని ఆసిస్ చూస్తుంది.
ఈ మ్యాచ్ గెలిస్తేనే టీంఇండియాకు టోర్నీ గెలిచే అవకాశాలుంటాయి. లేదంటే 2-0తో సిరీస్ చేజారిపోతుంది. కాగా ఆస్ట్రేలియాతో పోలిస్తే ఇండియాపైనే ఇప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంది. బ్యాటింగ్‌లో భారతజట్టు మంచి స్కోరే సాధిస్తోంది కానీ… బౌలింగ్లో మాత్రం నిరుత్సాహపరుస్తుందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం భారతజట్టుకు బౌలింగ్ ప్రధాన సమస్యగా మారింది. కాగా ఈ వైఫల్యంతోనే తాజాగా జరిగిన మ్యాచ్‌లు చేజార్చుకున్న ఇండియా ఇప్పుడు జరిగే మ్యాచ్లో బుమ్రాకు చోటు కల్పిస్తే కొంత మేరకు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తుంది.
డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేస్తాడని పేరున్న భువనేశ్వర్ గత మ్యాచుల్లో విఫలం అయ్యాడు. ఫలితంగా ఇండియా ఓటమి పాలైంది. అందుకే ప్రస్తుతం జరిగే ఈ మ్యాచ్‌లో అతడికి ఛాన్స్ ఇస్తారా లేదా అనే సందేహం వ్యక్తం అవుతుంది. అలాగే గాయం కారణంగా కొంతకాలం నుంచి జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా ఇవాళ్టి నుంచి మైదానంలో అడుగుపెడతాడో లేదో కూడా చూడాలి. మరో బౌలర్ హర్షల్ పటేల్, స్పిన్నర్ చాహల్ కూడా స్థాయికి తగ్గట్లు ఆడటం లేదనిపిస్తోంది. ఎదుటి టీంకు తేలికగా పరుగులను సమర్పించుకుంటున్నారు. ఇకపోతే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన దూకుడుని కనపరచాల్సి ఉంటుంది. కోహ్లీ, దినేష్ కార్తీక్ వంటి ప్రేయర్లు తమదైన మార్క్ ను కనపరచాల్సిన అవసం ఎంతైనా ఉంది. మరి ఇంక ఈరోజు మ్యాచ్లో టీం ఇండియా ఏ విధమైన ప్రతిభ కనుపరుస్తారు.. మ్యాచ్ గెలుస్తారా లేదా సిరీస్ను ఆసిస్ అప్పజెబుతారా అనేది వేచి చూడాలి.
ఇదీ చదవండి: IND vs ING Women’s Cricket: 23 ఏళ్ల తర్వాత… ఇంగ్లండ్ గడ్డపై టీం ఇండియా సరికొత్త రికార్డ్