Site icon Prime9

IND vs SRILANKA: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్.. టైటిలే లక్ష్యంగా భారత మహిళల జట్టు

ind vs srilanka womens asia cup final match

ind vs srilanka womens asia cup final match

IND vs SRILANKA: మహిళల ఆసియాకప్‌ తుది దశకు చేరుకుంది. మంచి ఫామ్‌లో ఉన్న హర్మన్‌ప్రీత్‌ సేన నేడు లంక జట్టుతో ఫైనల్ మ్యాచ్ తలపడనుంది. కాగా ఈ టోర్నీలో మిగిలిన ఈ ఏకైక మ్యాచ్‌లోనూ భారత్ తమ ఆధిపత్యాన్ని చూపించాలనుకుంటోంది.

సెమీస్లో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసిన భారత్‌, పాక్‌పై ఆఖరి బంతికి గెలిచిన లంక జట్లు ఫైనల్‌ పోరులో తలపడున్నాయి. ఈ టోర్నీ మొత్తంలో ఒక్క మ్యాచ్‌లోనే ఓడిన భారత జట్టు టోర్నమెంట్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇదిలా ఉండగా భారత్‌ ఖాతాలో ఇప్పటివరకు ఆసియాకప్ కు సంబంధించి ఆరు టైటిళ్లుండడం విశేషం. 2018లో జరిగిన చివరి టోర్నీలో మాత్రమే టీమిండియా ఓడిపోయింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో స్థాయికి తగ్గట్టుగా రాణిస్తున్న హర్మన్‌ప్రీత్‌ సేన ఈ ఆఖరి మ్యాచ్‌లోనూ ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకోవాలనుకుంటోంది. తద్వారా ఈ సారి ఏడో టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంతో భారత మహిళల జట్టు బరిలో దిగనుంది. అంతేగాకుండా ఇటీవల పురుషుల జట్టు సాధించలేకపోయిన ఆసియా కప్‌ను తాము నెగ్గాలని హర్మన్‌సేన భావిస్తోంది. ఆల్ రౌండ్ ప్రదర్శన కనపరుస్తూ యంగ్ ప్లేయర్లతో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 18 ఏళ్ల షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ ప్రత్యేక ఎఫర్ట్ తో జట్టు ఫైనల్‌ వరకు వచ్చిందని చెప్పవచ్చు.
ఇకపోతే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో అంతగా ప్రభావం కనపరచని స్టార్‌ ఓపెనర్‌ స్మృతి ఫైనల్లో బ్యాట్‌ ఝుళిపిస్తే ప్రత్యర్థికి చుక్కలు కనిపిస్తాయనడం అతిశయోక్తి కాదు. స్థాయికి మించి ఆడితేనే పాక్‌తో సెమీస్లో ఆఖరి బంతికి గెలిచిన శ్రీలంక జట్టు వాస్తవానికి భారత్‌కు ఏమాత్రం పోటీకాదని చెప్పవచ్చు. లంక మహిళలు అసాధారణ ఆటతీరును ప్రదర్శిస్తేనే టీం ఇండియాను ఓడించడం సాధ్యమవుతుందని విశ్లేషకుల అంటున్నారు.

ఇదీ చదవండి: ఎప్పటికీ ఆటగాడిగా, నిర్వాహకుడిగా ఉండలేరు.. సౌరవ్ గంగూలీ

Exit mobile version