IND vs SA 3ODI: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్లో భాగంగా ఢిల్లీ వేదికగా ఆఖరి మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న టీం ఇండియా మైదానంలో అదరగొట్టింది. సిరీస్ నెగ్గాలంటే గెలవక తప్పని మ్యాచ్లో భారత బౌలింగ్ దళం సపారీ జట్టుపై బంతులతో చెలరేగిపోయింది. ప్రతి బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సఫారీ జట్టు 99 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇన్నింగ్స్ ఆరంభంలో హైదరబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ షార్ట్ బాల్స్‌తో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించాడు. కాగా అతనితోపాటు వాషింగ్టన్ సుందర్ కూడా అద్భుతంగా రాణించాడు.
మిడిల్ ఓవర్లలో షాబాజ్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సఫారీ జట్టు కోలుకోలేపోయింది. ఓపెనర్లు జానెమన్ మలన్ (15), క్వింటన్ డీకాక్ (6) ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ కూడా సఫారీ జట్టును నిరుత్సాహ పరిచేలా ఆడారని చెప్పుకోవచ్చు. ఇకపోతే హెన్రిక్ క్లాసెన్ మాత్రమే 34 పరుగులు చేశారు.
ఆ జట్టు మొత్తం కలిపి కూడా కనీసం 100 పరుగులు కూడా చెయ్యలేకపోయింది. టెయిలెండర్లను వరుసపెట్టి పెవిలియన్ చేర్చి 99 పరుగులకే ఆ జట్టు కథ ముగించేశాడు కుల్దీప్ యాదవ్.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో సత్తా చాటగా, సిరాజ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్ తలో రెండు వికెట్లు తీశారు.
ఇదీ చదవండి:టీంఇండియా వర్సెస్ సఫారీల నిర్ణయాత్మక పోరు.. విజయం ఎవరిది..?