IND vs SA : టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్, జింబాబ్వే టీమ్స్ వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు సౌతాఫ్రికా బ్రేక్ వేసింది. ఆదివారం పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పై సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.సౌతాఫ్రికా పేసర్ల దాడికి టీమిండియా బ్యాట్స్‌మెన్స్ అందరూ అల్లాడిపోయారు.ఒక్క సూర్యకుమార్ యాదవ్ తప్పా.. మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అందరూ అంతా గ్రౌండు లోకి ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు వెళ్లిపోయారు. బౌలింగ్‌లో టీమిండియా పోరాడినా చివరికి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విజయంతో గ్రూప్-B లో 5 పాయింట్లతో సౌతాఫ్రికా అగ్రస్థానానికి చేరుకుంది. టీమిండియా రెండో స్థానానికి వచ్చింది.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ టీమిండియా ఓటమికి అసలు కారణం చెప్పాడు. ‘పిచ్‌లో మాకు అనుకూలంగా లేదని మేము ముందే అర్దం అయింది. స్పీడ్ బౌలర్లకు పిచ్ ఎంతగానో సహకరిస్తుందని తెలుసు.తరువాత లక్ష్యాన్ని ఛేదించడం అంత ఈజీ కాదని అందుకే ముందు బ్యాటింగ్ చేశాం.చేసింది కొన్ని పరుగులే కానీ మేము చివరి వరకు మంచి పోరాటం చేశాం. కానీ ఈ రోజు విజయం సౌతాఫ్రికా వైపు ఉంది.