IND Vs NZ ODI: వన్డే కు రెడీ అవుతోన్న ఉప్పల్ స్టేడియం.. హైదరాబాద్ మ్యాచ్ కు పేటీఎమ్ లో టికెట్స్

భారత్, న్యూజిలాండ్ ( IND vs NZ) వన్డే సిరీస్ కు రంగం సద్ధమవుతోంది. టీంఇండియా న్యూజిలాండ్ తో 3 వన్డేలు, 3 టీ20 లు ఆడనుంది. సిరీస్ లో భాగంగా ఈ నెల 18 న తొలి మ్యాచ్ హైదరాబాద్ లో జరగనుంది.

IND Vs NZ ODI: భారత్, న్యూజిలాండ్ ( IND vs NZ) వన్డే సిరీస్ కు రంగం సద్ధమవుతోంది. టీంఇండియా న్యూజిలాండ్ తో 3 వన్డేలు, 3 టీ20 లు ఆడనుంది. సిరీస్ లో భాగంగా ఈ నెల 18 న తొలి మ్యాచ్ హైదరాబాద్ లో జరగనుంది. 21న రాయ్ పూర్ వేదికగా రెండ్ వన్డే, 24న ఇండోర్ వేదికగా మూడో వన్డే జరగుతుంది. కాగా నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ‘హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్’(హెచ్ సీఏ) అన్నీ ఏర్పాట్లు చేస్తోంది.

ఉప్పల్ లో మ్యాచ్ అనగానే గత ఏడాది సెప్టెంబర్ లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్ గుర్తుకువస్తుంది. టీ20 మ్యాచ్ టికెట్లు కొనేందుకు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ కు వచ్చిన అభిమానులకు హెచ్ సీఏ(HCA) సరైన ఏర్పాటు లేకపోవడంతో తోపులాట, పోలీసుల లాఠీచార్జీ , పలువురి గాయాలు.. ఇలా ఆ ఘటన సంచలనంగా మారింది. హైదారాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేసిన పొరపాటుతో అభిమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాస్ట్ మ్యాచ్లో ఆఫ్ లైన్ లో టికెట్లు అమ్మి రచ్చను క్రియేట్ చేసిన అసోసియేషన్.. ఈ వన్డేకు తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఈసారి టికెట్లు ఆన్ లైన్ లె మాత్రమే అందుబాటులో ఉంచుతామని హెచ్ సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్ తెలిపారు.

పేటీఎమ్ లో టికెట్ల అమ్మకం

ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 39,112 కాగా, అందులో 9,695 టికెట్లను కాంప్లిమెంటరీ కోటా కింద ఇస్తారు.

మిగిలిన 29 వేల 417 టికెట్లను విక్రయిస్తారు. కాంప్లిమెంటరీ పాసులు తప్ప మిగిలిన వాటిని ఈ సారి పేటీఎమ్(Paytm) ద్వారా అమ్మనున్నారు.

ఒక వ్యక్తి గరిష్టంగా 4 టికెట్లను మాత్రమే కొనుగోలు చేయగలరు. టికెట్ ధర నిర్థేశ ప్రదేశాలన్ని బట్టి రూ. 850 నుంచి మొదలై రూ. 20,650 వరకు ఉంది.

13 నుంచి టికెట్లు

ఈనెల 13 శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి టికెట్లు రిలీజ్ చేస్తారు. ఈ టికెట్లను నాలుగు ఫేజ్ లుగా సేల్ చేయనున్నారు. 13న 6 వేల టికెట్లు, 14న 7 వేల టికెట్లు, 15 న ఏడు వేలు, మిగిలిన వాటిని 16 న అమ్ముతారు. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్నవారు.. ఆ టైంలో సెలెక్ట్ చేసుకున్న ప్రదేశాల్లో ఫిజికల్ టికెట్లను కలెక్ట్ చేసుకోవాలి. ఎల్బీ స్టేడియం , గచ్చిబౌలి స్టేడియాల్లో.. ఆన్ లైన్ బుకింగ్ బార్ కోడ్ ఆధారంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 వరకు టికెట్ల ను కలెక్ట్ చేసుకోవచ్చు.

న్యూజిల్యాండ్ జట్టు ఈ నెల 14న హైదరాబాద్ చేరుకుంటుంది. అనంతరం 15 నుంచి కివీస్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంటారు. కాగా, శ్రీలంక వన్డే సిరీస్ ముగించుకుని ఈ నెల 16న టీంఇండియా హైదరాబాద్ వచ్చి ఒకరోజు ప్రాక్టీస్ లో పాల్గొంటుంది.

ఇవీ చదవండి:

బాలకృష్ణ, చిరంజీవి అభిమానుల మధ్య వార్.. వైసీపీ కులాల కుట్ర.. లోకేష్ ట్వీట్ వైరల్

 థియేటర్ లో మాస్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. రచ్చ చేసిన ఫ్యాన్స్

Ram Charan-Upasana: నాతో కలిసి నా బిడ్డకూ ఇది స్పెషల్ ఎక్స్ పీరియన్స్.. ఉపాసన ఎమోషనల్ ట్వీట్

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/