Site icon Prime9

IND vs AUS : కోహ్లీ , సూర్యాకుమార్ యాదవ్ ఛేజింగ్కు దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం

india match prime9news

india match prime9news

IND vs AUS : టీమిండియాపై ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ల టీ20 లో సిరీస్‌ను కైవసం చేసుకుంది.ఈ సిరీస్‌ను 2-1తో టీమిండియా గెలుచుకుంది.హైదరాబాద్‌ వేదికగా ఉప్పల్ స్టేడియంలో టీ20 మూడవ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఆస్ట్రేలియా మొదటిగా బ్యాటింగ్ చేసి 120 బంతులకు 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. 7-8 ఓవర్ల వద్ద ఆస్ట్రేలియా దూకుడు మామూలుగా లేదు ఆ సమయంలో 220 పరుగులు ఈజీగా చేసేస్తారనిపించింది.ఆ సమయంలో టీమిండియా వెంటవెంటనే వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా రన్ రేట్ తగ్గుతూ వచ్చింది.

ఇక టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే కేఎల్ రాహుల్ 5 పరుగులు చేయగా,రోహిత్ శర్మ 30 పరుగులు చేసి అవుట్ అయ్యారు.ఆ తరువాత విరాట్ కోహ్లీ,సూర్య కుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను వాళ్ళ చేతుల్లోకి తీసుకొని సూర్య కుమార్ యాదవ్ 69 పరుగులు చేసి అవుట్ అవడంతో,తరువాత విరాట్ కోహ్లీ తన ఇన్నింగ్స్ కొనసాగించాడు.సూర్య కుమార్ యాదవ్ 36 బంతులకు 69 పరుగులు చేయగా, విరాట్ కోహ్లి 48 బంతులకు 63 పరుగులు చేశారు.

ఈ మ్యాచ్ 20 వ ఓవర్ వరకు ఆడాలిసి వచ్చింది.20 ఓవర్ లోఆఖరి రెండు బంతుల వరకూ సాగింది ఈ మ్యాచ్.20 వ ఓవర్లో మరో 3 బంతులకు 4 పరుగులు కావలిసిన వద్ద విరాట్ కోహ్లీ అవుట్ ఇక మ్యాచ్ మీద ఆశలు వదులుకోవడమే అన్న సమయంలో హార్దిక్ పాండ్యా చేసిన మ్యాజిక్ వల్ల బౌండరీకు కొట్టడంతో టీమిండియా గెలుపొందారు.ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయంతో సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

Exit mobile version