Site icon Prime9

Shreyas Iyer: టీమిండియా బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్‌లో ఆసక్తికర వీడియో.. అదృష్టం అంటే అయ్యర్ దే.. బంతి వికెట్లను తాకినా నాటౌటే..!

IN IND vs BAN first test match shreyas-iyer-batting ball touched the vickets and bails not fall video goes viral

IN IND vs BAN first test match shreyas-iyer-batting ball touched the vickets and bails not fall video goes viral

Shreyas Iyer: బుధవారం నాడు టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య ఛటోగ్రామ్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పవచ్చు. ఇక ఈ మ్యాచ్ లో అయ్యర్ అయితే చెలరేగిపోయాడని చెప్పవచ్చు. దానితో అయ్యర్ కు ఉన్న అదృష్టం ఉంటే తమకు జీవితంలో ఇంకేం అక్కర్లేదు అంటున్నారు పలువురు నెటిజన్లు. ఈ వ్యాఖ్యలకు వెనుక ఓ పెద్ద కారణమే ఉందడోయ్.. బంగ్లాతో మొదటిరోజు తొలి టెస్టు ఆట ముగిసే సమయానికి క్రీజులో నిలబడిన ఏకైక బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (82 నాటౌట్) మాత్రమే. ఇక అక్షర్ పటేల్ (14) సైతం చివరి బంతికి కూడా అవుటయ్యాడు.

బంగ్లాదేశ్ తో జరుగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు అంతగా ప్రతిభ కనపరచలేకపోయింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్ (20), కేఎల్ రాహుల్ (22) సహా భారీ అంచనాలతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ సైతం అత్యల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. దీంతో భారత జట్టు 48 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్ వైఫల్యమవడంతో కష్టాల్లో ఉన్న జట్టును ఒకానొక దశలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ (46) ఆదుకున్నాడనే చెప్పాలి. కానీ కొంత సమయం తర్వాత పంత్ కూడా పెవిలియన్ బాటపట్టాడు.

IN IND vs BAN first test match shreyas-iyer-batting ball touched the vickets and bails not fall video goes viral

సరిగ్గా అదే సమయంలో అప్పుడే క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్.. వెటరన్ పుజారా (90)తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యంతో రాణించారు. అయితే అయ్యర్ కు అదృష్టం కూడా కలిసొచ్చిందనే చెప్పాలి. బంగ్లా బౌలర్ ఎబాదత్ హోసెన్ 84వ ఓవర్లో వేసిన బంతిని అయ్యర్ సరిగా అంచనా వెయ్యలేకోయాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బాల్ ను ఎలాగైనా ఆడేందుకు యత్నించి విఫలమయ్యాడు.
ఈక్రమంలోనే అనూహ్యంగా ఆ బంతి వికెట్లను తాకింది. మైదానంలో ఉన్న వీక్షకులంతా ఒక్కసారిగా షాక్ అవుతూ అయ్యర్ అవుట్ అయ్యాడనే అనుకున్నారు.. కానీ ఇక్కడే ఓ మ్యాజిక్ జరిగినట్టు అయ్యింది. బంతి వికెట్లను తాకినా కానీ బెయిల్ కిందపడలేదు.

దానితో రూల్స్ ప్రకారం అయ్యర్ అవుట్ కాదు. ఇది చూసిన బంగ్లా ఫీల్డర్లు నోరెళ్ళబెట్టారు. ఇక క్రికెట్ ఫ్యాన్స్ అయితే దీనిపై తెగ జోకులు పేలుస్తున్నారనుకోండి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు బెయిల్ బరువు మార్చాలని, ఇటీవలి కాలంలో ఇలా బెయిల్ కిందపడని ఘటనలు ఎక్కువ అయిపోతున్నాయి అని అంటుంటే మరికొందరు మాత్రం ఏదేమైనా అయ్యర్ లక్కే లక్కు అని నెట్టింట మీమ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: మొరాకో ఓటమితో ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ కు చేరిన ఫ్రాన్స్.. అర్జెంటీనాతో ఆఖరి పోరు

 

Exit mobile version