ICC World Cup 2023 Schedule: భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023 షెడ్యూల్ వచ్చేసింది. టోర్నమెంట్ కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరుగనున్నాయి. కాగా అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షూరూ కానుంది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది.
అదే విధంగా క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్ భారత్‌లో మొత్తం 10 వేదికలగా జరగనుంది. అందులో హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, ఢిల్లీ, చెన్నై, లక్నో, పూణే, బెంగళూరు, ముంబై, కోల్‌కతా ఉన్నాయి. ఇదిలా ఉంటే పాకిస్థాన్ తన రెండు మ్యాచ్‌ల వేదికను మార్చాలని డిమాండ్ చేసింది. చెన్నైలో ఆఫ్ఘనిస్థాన్, బెంగళూరులో ఆస్ట్రేలియాతో ఆడేందుకు పాకిస్తాన్ ఇష్టపడలేదు. అంతే కాదు అహ్మదాబాద్‌లో భారత్‌తో తలపడేందుకు కూడా సిద్ధంగా లేకపోయినా ఐసీసీ మాత్రం పాక్ వినతిని పట్టించుకోలేదు.
సెప్టెంబర్ 29 నుంచి వార్మాప్ మ్యాచ్‌లు(ICC World Cup 2023 Schedule)
ఇక అదే విధంగా వార్మప్ మ్యాచ్‌లకు హైదరాబాద్‌తో పాటు గౌహతి, తిరువనంతపురం అతిధ్యం ఇవ్వనున్నాయి. వార్మాప్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్నాయి. కాగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా అక్టోబర్ 6, 9, 12న మూడు వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
అక్టోబర్ 6న (శుక్రవారం) పాకిస్థాన్ వర్సెస్ క్వాలిఫయర్-1 జట్టు మధ్య మ్యాచ్ జరుగుతుంది.
అక్టోబర్ 9 (సోమవారం) న్యూజిలాండ్ వర్సెస్ క్వాలిఫయర్ -1 జట్టు మధ్య మ్యాచ్ జరుగుతుంది.
అక్టోబర్ 12 ( గురువారం) పాకిస్థాన్ వర్సెస్ క్వాలిఫయర్ -2 జట్టు మధ్య మ్యాచ్ జరుగుతుంది.
ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఉప్పల్ స్టేడియంలో జరిగే మూడు మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లు పాకిస్థాన్ ఆడేవే కావటం గమనార్హం.
నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్
నవంబర్ 15: సెమీఫైనల్-1 (ముంబై)
నవంబర్ 16: సెమీఫైనల్-2 (కోల్‌కతా)
నవంబర్ 19: ఫైనల్ (అహ్మదాబాద్)
GET YOUR CALENDARS READY! 🗓️🏆
The ICC Men’s @cricketworldcup 2023 schedule is out now ⬇️#CWC23https://t.co/j62Erj3d2c
— ICC (@ICC) June 27, 2023