Site icon Prime9

Virat Kohli: విరాట్‌ కోహ్లి పెదాలపై ముద్దు పెట్టిన అమ్మాయి

virat kohli

virat kohli

Virat Kohli: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి గురించి పెద్దగా ఎవరికి చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. విరాట్ తో కలిసి ఓ ఫోటో దిగిన చాలు అనుకునే వారు చాలామందే ఉన్నారు. అలాంటింది ఓ అమ్మాయి కోహ్లి పెదాలపై ముద్దు పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కోహ్లి పెదాలపై ముద్దు (Virat Kohli)

విరాట్‌ కోహ్లికి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలిసిందే. రన్ మెషిన్ అంటే.. పడిచచ్చే అభిమానులు కోట్లలో ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో విరాట్ కి ఉన్న ఫాలోయింగే దీనికి నిదర్శనం. సాకర్ ఆటగాళ్లు.. లియోనల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్గో తర్వాత అంతటి ఆదరణ కలిగిన అభిమానులు విరాట్ సొంతం. శత్రు దేశాల అభిమానులు సైతం.. కోహ్లి ఆటకు, లుక్స్‌ కు ఫిదా అవుతారు. ఇటీవల కోహ్లిని.. అభిమానులు GOAT అని.. (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌) పరిగణించాలని సామాజిక మాధ్యమాల్లో డిబెట్లు పెట్టారు. అలాంటి కోహ్లిని.. టీవీల్లో చూస్తే పిచ్చెక్కిపోతారు. ఇక అతన్ని చూసే అవకాశం వచ్చినా.. అతనితో ఫోటో దిగే ఛాన్స్‌ వచ్చినా వారి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి.

మైనపు బొమ్మకు ముద్దు పెట్టిన లేడీ..

విరాట్ కోహ్లిపై ఉన్న అభిమానంతో.. ఓ మహిళ అభిమాని కోహ్లి మైనపు బొమ్మ పెదాలపై ముద్దు పెడుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ గా మారి.. హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను చూస్తే.. మహిళ అభిమానికి కోహ్లి అంటే ఏ రేంజ్ లో పిచ్చి ఉందో అర్ధం అవుతుంది. ఇక ఈ వీడియోలో కోహ్లి బొమ్మకు ముద్దు పెడుతూ.. ఆ అమ్మాయి ప్రదర్శించిన హావభావాలు క్రికెట్‌ అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాయి. నెటిజన్లు ఈ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరో.. ఈ సన్నివేశం ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. విరాట్‌ కోహ్లి ప్రస్తుతం బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023తో బిజీగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు కోహ్లి ఆశించిన స్థాయిలో రాణించలేదు. మెుదటి టెస్ట్ లో 12, రెండో టెస్ట్‌లో 44, 20 పరుగులు చేశాడు. ఇటీవలి కాలంలో టీ20, వన్డే ఫార్మాట్‌లో సెంచరీలు చేసిన కోహ్లి.. టెస్ట్‌ల్లో మాత్రం పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కోహ్లి చివరిసారి 2019 నవంబర్ 22న టెస్టు సెంచరీ చేశాడు. వచ్చే టెస్టులో విరాట్ సెంచరీ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Exit mobile version