Site icon Prime9

IND vs ENG: ఇండియా బ్యాటింగ్.. పంత్‌కే కీపింగ్ బాధ్యతలు

england-won- the toss-india-to-bat-first-in-t20-worldcup-semis

england-won- the toss-india-to-bat-first-in-t20-worldcup-semis

IND vs ENG: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. రెండ‌వ సెమీస్‌లో భాగంగా నేడు భారత్ ఇంగ్లండ్ తో తలపడుతుంది. కాగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫ‌స్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అడిలైడ్‌లో జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా ఆడ‌నున్న‌ది. తనకు గాయంతో ఎటువంటి స‌మస్య లేద‌ని జ‌ట్టులో ఎటువంటి మార్పు చేయ‌డం లేద‌ని రోహిత్ తెలిపాడు. జింబాబ్వేతో ఆడిన జ‌ట్టుతోనే ఈ మ్యాచ్ ఆడుతున్న‌ట్లు వెల్లడించారు. దీనితో ఈ మ్యాచ్ లో కీపింగ్ బాధ్య‌త‌ల్ని పంత్ చేప‌ట్ట‌నున్నాడు.

అడిలైడ్‌ వేదికగా ఇప్ప‌టి వ‌ర‌కు 11 టీ20 మ్యాచ్‌లు జ‌రిగాయి. అయితే ఇక్క‌డ టాస్ గెలిచిన ఏ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు మ్యాచ్‌ను గెలిచిన దాఖలాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే ఇంగ్లండ్ జ‌ట్టులో డేవిడ్ మల‌న్‌, మార్క్ వుడ్ స్థానంలో ఫిల్ సాల్ట్‌, క్రిస్ జోర్డాన్‌లు బరిలోకి దిగనున్నారు. ఈ మ్యాచ్ లో గెలుపొందిన జట్టుతో పాకిస్థాన్ జట్టు టోర్నీ కప్ కోసం తలపడనుంది.

ఇదీ చదవండి: ఐసీసీ T20 ర్యాంకింగ్స్.. టాప్ టెన్ లో కోహ్లికి దక్కని స్దానం

Exit mobile version