Site icon Prime9

Sourav Ganguly: ఎప్పటికీ ఆటగాడిగా, నిర్వాహకుడిగా ఉండలేరు.. సౌరవ్ గంగూలీ

Sourav Ganguly

Sourav Ganguly

Mumbai: బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ 3 సంవత్సరాల తర్వాత బోర్డు నుండి వైదొలగుతుండగా, అతని స్థానంలో రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టడానికి సిద్దమవుతున్నారు. అక్టోబర్ 18న ముంబైలో బిన్నీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్న సందర్బంగా గంగూలీ మాట్లాడుతూ, తాను ఎప్పటికీ అడ్మినిస్ట్రేటర్‌గా ఉండలేనని చెప్పారు.

నేను ఐదేళ్లు క్యాబ్ అధ్యక్షుడిగా ఉన్నాను. నేను బీసీసీఐ అధ్యక్షుడిగా మూడేళ్లు ఉన్నాను. వీటన్నింటికీ నిబంధనలున్నాయి, తర్వాత మీరు వదిలి వెళ్లిపోవాలి. క్రికెటర్‌గా సవాలు చాలా ఎక్కువ. నిర్వాహకుడిగా, మీరు చాలా ఉపయోగపడాలి. మీరు టీమ్‌కి మెరుగైన విషయాలు అందించాలి. నేను ఆటగాడిగా చాలా కాలం పాటు ఆడాను. నాకు అది అర్థమైంది. నేను దానిని పూర్తిగా ఆస్వాదించాను. ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్‌ను స్థాపించాను. అడ్మినిస్ట్రేటర్‌గా గొప్ప క్షణాలు ఉన్నాయి. మీరు ఎప్పటికీ ఆడలేరు అంతేకాదు మీరు ఎప్పటికీ నిర్వాహకుడిగా ఉండలేరని అన్నారు.

జీవితంలో ఏదీ శాశ్వతం కాదు ..

మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ తప్పుకోవడం పై బారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ఒక వ్యక్తి చాలా కాలం పాటు కొన్ని పనులను మాత్రమే చేయగలడు. తరువాత ఇతర విషయాలకు వెళ్లాలి. కొత్త వ్యక్తులు ప్రవేశించడానికి మరియు కొత్త పనులు చేయడానికి ఇది ఒక ఆరోగ్యకరమైన వ్యాయామం అని శాస్త్రి పేర్కొన్నారు. 1983 ప్రపంచకప్‌లో బిన్నీ తన తోటి ఆటగాడని, ప్రపంచకప్ విజేత బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండటం ఇదే తొలిసారి కాబట్టి తాను చాలా సంతోషంగా ఉన్నానని శాస్త్రి చెప్పారు.

Exit mobile version