Australia: క్రికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జట్టుకు స్లో ఓవర్ రేట్ పెద్ద ఇబ్బందిగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే దీని నుంచి తప్పించుకోవడానికి ఆసిస్ జట్టు ఓ సరికొత్త ప్లాన్ అమలుచేసింది. మరి అదేంటో తెలుసుకుందాం.
గతంలో స్లో ఓవర్ రేట్ కనపరిచే ఆటగాళ్లకు ఐసీసీ జరిమానాలు విధించేది. కాగా తాజాగా ఈ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. సాధారణంగా పవర్ ప్లే టైమ్‌లో 30 యార్డ్ సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లను సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ స్లో ఓవర్ రేట్ నమోదైతే మాత్రం 30 యార్డ్ సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లను మాత్రమే ఉంచాలని నిబంధలు ఉన్నాయి. ఇది బ్యాట్స్‌మెన్స్ కు బాగా కలిసివస్తోంది. బ్యాట్స్ మెన్ ఫోర్లు, సిక్సర్లు బాదిన తరువాత బంతి మళ్లీ తిరిగి బౌలర్ చేతికి వచ్చేందుకు చాలా సమయం పడుతోంది. ముఖ్యంగా ఫోర్లు కొట్టిన సమయంలో ఎక్కువ టైమ్ పడుతోంది. ఇది కూడా ఒకింత స్లో ఓవర్ రేట్‌కు కారణం అవుతోంది.
ఈ నేపథ్యంలోనే స్లో ఓవర్ రేట్ నుంచి తప్పించుకునేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఓ సరికొత్త ఐడియా వేసింది. బ్యాట్స్‌మెన్ బౌండరీలు బాదిన ప్రతిసారి ఫీల్డర్లు బౌండరీల వద్దకు పరిగెత్తాల్సిన పనిలేకుండా చక్కటి ఉపాయాన్ని అమలు చేసింది. బౌండరీ లైన్ దగ్గర గ్రౌండ్ స్టాఫ్‌ను, డగౌట్‌లో కూర్చున్న ఆటగాళ్లను ఉంచుతోంది. తద్వారా బాల్ బౌండరీ లైన్ దాటగానే వీళ్లు బంతిని అంతే వేగంగా వెంటనే బౌలర్కు అందిస్తారు. దీనితో చాలా టైమ్ సేవ్ అవుతుంది. దీని వల్ల స్లో ఓవర్ రేట్ దాదాపు నియంత్రణలోకి వస్తుంది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసిస్ ఈ ప్లాన్‌ను అమలు చేసి సక్సెస్ అయ్యింది. దానితో టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఈ ప్లాన్ ను పాటించేందుకు ఐసీసీ నుంచి పర్మిషన్ కూడా తీసుకుంది. కాగా ఇప్పటికే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు అన్నింటిలో అన్ని జట్లు ఈ ప్లాన్ అమలు చేసి స్లో ఓవర్ రేట్ నుంచి తప్పించుకున్నాయి.
ఇదీ చదవండి: ప్రపంచకప్‌లోనే భారీ షాట్.. సిద్దిఖి సిక్సర్ చూసి అంతా షాక్..!