Site icon Prime9

T20 World Cup 2022: ఐర్లాండ్ పై ఆసీస్ ఘన విజయం

aus vs irl prime9news

aus vs irl prime9news

T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌లో సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గా ఆస్ట్రేలియా తన సత్తా చాటింది. ఇంగ్లాండ్ కు షాకిచ్చిన ఐర్లాండ్ పై గెలుపొందింది. ఈ గెలుపుతో ఆసీస్ పాయింట్ల టేబుల్లో రెండో స్థానానికి చేరుకుంది. కాకపోతే నెట్‌ రన్‌రేట్‌ మైనస్‌లో ఉండటం కొంచం ఆ జట్టు కలవరపెట్టే ఆంశంగా మారింది.

సూపర్-12 లో భాగంగా, సోమవారం బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియ, ఐర్లాండ్ లు తలపడ్డాయి. మొదటి బ్యాటింగ్ చేసిన ఆసీస్ 120 బాల్స్ కు 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ అర్థ సెంచరీతో 63 పరుగులు, స్టాయినిస్ 35 పరుగులు చేసి వీరిద్దరూ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెకార్తి (3/29), జోష్‌ లిటిల్‌ (2/21) సత్తా చాటారు.

ఛేజింగ్ చేయడానికి బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు 18.1 ఓవర్లలో 137 పరుగులకె కుప్పకూలింది. టక్కర్ తప్ప మిగతా ఆటగాళ్లు అందరూ ఈ మ్యాచ్లో విఫలమయ్యారు. ఒంటరి పోరాటం చేసిన టక్కర్ 48 బాల్స్ కు 71 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

Exit mobile version