Site icon Prime9

BCCI: బీసీసీఐకు మరోసారి రూ.955 కోట్ల నష్టం..!

bcci-sacked-senior-selection-committee-members

bcci-sacked-senior-selection-committee-members

BCCI: క్రికెట్ అంటే చాలు కుర్రకారు ఊర్రూతలూగిపోతారు. భారత్లో పలు దేశాల ప్లేయర్లకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందులోనూ ఇంక భారత క్రికెటర్లకైతే ప్రత్యేకంగా చప్పనవసరం లేదు డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇకపోతే ఈ క్రికెట్ మ్యాచ్లలో ప్రతీ అంశం అత్యంత ఖరీదైనదేనని చెప్పవచ్చు. ఆటగాళ్లు మొదలుకుని మైదానం, టిక్కెట్లు, ప్రసారాలు ఇలా అనేక విభాగాల్లో క్రికెట్ బోర్డులు డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది.

ఇకపోతే భారత క్రికెట్‌ నియంత్రణా మండలి (బీసీసీఐ) కేంద్ర ప్రభుత్వం తీరుతో ఇప్పటికే దాదాపు రూ. 200 కోట్లు నష్టపోయింది. కాగా ఇప్పుడు మరోసారి ప్రమాదం అంచుల్లో ఉంది. వన్డే ప్రపంచకప్‌ వచ్చే ఏడాది మనదేశం ఆతిథ్యమివ్వనుండగా దీనికి సంబంధించిన ప్రసారాల ద్వారా సమకూరే ఆదాయంపై కేంద్ర ప్రభుత్వం 21.84 శాతం పన్ను విధించింది. ఐసీసీ నిర్వహించే టోర్నీలకు ఆతిథ్య దేశాలు పన్ను మినహాయింపు ఇవ్వాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు.
దీనితో బీసీసీఐకి మరోసారి రూ.955 కోట్ల నష్టం వాటిల్లనుంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్లకు కూడా పన్ను మినహాయింపు ఇవ్వలేదు దానివల్ల బోర్డు రూ. 193 కోట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్.. టైటిలే లక్ష్యంగా భారత మహిళల జట్టు

Exit mobile version