Site icon Prime9

IPL 2025 43rd Match: చెన్నై, హైదరాబాద్ మధ్య కీలక పోరు.. ఎవరూ ఓడినా ఇంటికే..!

Chennai Super Kings vs Sunrisers Hyderabad IPL 2025

Chennai Super Kings vs Sunrisers Hyderabad IPL 2025

Chennai Super Kings Vs Sunrisers Hyderabad IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ 43వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నై నగరంలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది.

 

ఈ సీజన్‌లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్  8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 2 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. 6 మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైంది. ఇక, హైదరాబాద్ విషయానికొస్తే.. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌ల్లో ఓడగా.. 2మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఈ ఇరు జట్లు ప్లే ఆఫ్స్ చేరేందుకు మిగతా మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది.

 

జట్టు అంచనా:

హైదరాబాద్‌: ట్రావిస్‌ హెడ్,అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హెన్రిచ్‌ క్లాసెన్, అనికేత్‌ వర్మ, కమిన్స్‌ (కెప్టెన్‌), అభినవ్‌ మనోహర్, హర్షల్‌ పటేల్, జీషన్‌ అన్సారీ, జైదేవ్‌ ఉనాద్కట్, ఇషాన్‌ మలింగ.

 

చెన్నై: షేక్‌ రషీద్, రచిన్‌ రవీంద్ర, ఆయుశ్‌ మాత్రే, రవీంద్ర జడేజా, శివమ్‌ దూబే, విజయ్‌ శంకర్, ధోని (కెప్టెన్‌), జేమీ ఓవర్టన్, అశ్విన్, ఖలీల్‌ అహ్మద్, నూర్‌ అహ్మద్, పతిరణ.

Exit mobile version
Skip to toolbar