Site icon Prime9

Border Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చరిత్ర ఏంటో తెలుసా?.. ఈ సిరీస్ కి ఆ పేరు ఎలా వచ్చింది?

border gavaskar trophy

border gavaskar trophy

Border Gavaskar Trophy: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ.. ఈ పేరు క్రికెట్లో చాల ప్రత్యేకమైనది. ఈ సిరీస్ రెండు జట్లకు అత్యంత కీలకమైనది. ఈ సిరీస్ వచ్చిందంటే చాలు.. క్రికెట్ అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్కంఠ నెలకొంటుంది. మరి ఈ సిరీస్ కు ఈ పేరేలా వచ్చింది. ఆస్ట్రేలియా- భారత్ మధ్యే ఈ సిరీస్ ఎందుకు జరుగుతుంది.

ఫిబ్రవరి 9 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. నాలుగు మ్యాచ్ లు భారత్ ఆస్ట్రేలియాతో ఆడనుంది. మెుదటి టెస్ట్.. నాగ్‌పూర్‌లోని విదర్భ స్టేడియంలో జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే సిరీస్ ను.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అంటారు. ఇప్పటి వరకు 15 సార్లు ఈ సిరీస్ జరగ్గా.. ఎక్కువసార్లు భారత్ పై చేయి సాధించింది.

మెుదటి సిరీస్ ఎప్పుడు జరిగింది.

ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉంది.

126 పాయింట్లో ఆ జట్టు అగ్రస్థానంలో ఉండగా.. 115 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది.

ఇక ఈ సిరీస్ విషయానికి వస్తే.. 1996లో భారత్ -ఆసీస్ టెస్ట్ సిరీస్‌కు అలెన్ బోర్డర్- సునీల్ గవాస్కర్ పేరు పెట్టారు.

అప్పటి నుంచి ఈ సిరీస్ ను ఇదే పేరుతో పిలుస్తు వస్తున్నారు. గవాస్కర్- అలెన్ బోర్డర్ తమ దేశాల తరపున టెస్టుల్లో 10వేల కన్న ఎక్కువ పరుగలు సాధించారు.

ఇదే సంవత్సరంలో జరిగిన తొలి సిరీస్ లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది.

ఇప్పటి వరకు భారత్- ఆసీస్ మధ్య 27 టెస్ట్ సిరీస్ లు జరగ్గా.. అందులో 14 సిరీస్ లను టీమిండియా సొంతం చేసుకుంది.

ఆసీసీ 12 సిరీస్ లను గెలుచుకుంది. ఈ సిరీస్ లో భాగంగా.. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ఫిబ్రవరి 9న తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

స్వదేశంలో టెస్ట్ సిరీస్‌ అనగానే.. భారత్‌ స్పిన్‌ పిచ్‌లకే ప్రాధాన్యం ఇస్తుంది.

దీంతో ఆసీస్ ఆటగాళ్లు స్పిన్‌ ను సమర్థంగా ఎదుర్కొనేందుకు.. ప్రాక్టీస్‌ సెషన్‌లో స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కొంటున్నారు.

ఇక భారత్ కూడా.. స్పిన్నర్లతో ప్రాక్టీస్ చేస్తోంది. ఇండియాలో స్పిన్ పిచ్ లకు ప్రాధాన్యం కాబట్టి.. భారత్ అలవోకగా సిరీస్ గెలుస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఇప్పటి వరకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓ రికార్డ్ సచిన్ పేరట ఉంది.

ఈ సిరీస్ లలో భారత్ తరపును సచిన్ టెండుల్కర్.. అత్యధిక పరుగులు సాధించాడు. 65 ఇన్నింగ్స్ లలో 3262 పరుగులు సాధించాడు.
భారత స్పిన్ దిగ్గజం.. అనిల్ కుంబ్లే 20 మ్యాచుల్లో 111 వికెట్లు తీసి అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రికార్డ్ ను నెలకొల్పాడు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version